»   »  'పవర్ పాండి' రీమేక్: రజనీ ఆదేశించారు.. మోహన్ బాబు ఆచరిస్తారా!

'పవర్ పాండి' రీమేక్: రజనీ ఆదేశించారు.. మోహన్ బాబు ఆచరిస్తారా!

Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల విషయంలోను ఈ ఇద్దరు ఒకరికొకరు పూర్తి సహాయ సహాకారాలు అందించుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఒకప్పుడు 'పెద్దరాయుడు' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాను రజనీకాంత్ రోల్ లేకుండా ఊహించలేం. తన చిరకాల మిత్రుడు మోహన్ బాబు కోరిక మేరకు రజనీ మరో మాట లేకుండా ఈ సినిమాలో నటించేశారు.

ఇక ఇప్పుడు రజనీకాంత్ వంతు వచ్చింది. రజనీ ఆదేశించారు.. మోహన్ బాబు ఆచరిస్తారా? అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇంతకీ రజనీ ఏం ఆదేశించారనే కదా సందేహం!. తాజాగా రజనీ అల్లుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'పవర్ పాండి' తమిళ్‌లో సూపర్ హిట్ సాధించడంతో.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల్సిందిగా మోహన్ బాబుకు రజనీ సూచించారట.

rajinikanth suggestion to mohanbabu over powerpaandi remake

ఈ సినిమాను ప్రత్యేకంగా రజనీ కోసం 'షో' వేసిన సందర్బంగా మోహన్ బాబును కూడా పిలిచారట. సినిమా ఆసాంతం ఎంతగానో ఆకట్టుకుందని అల్లుడు ధనుష్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన రజనీ.. మరో పదేళ్ల వరకు ఇంకో సినిమా చేయకని కూడా చెప్పారట. ఈ ఒక్క సినిమా చాలు ఎన్నో ఏళ్లు నీ పేరు నిలబడిపోవడానికి అన్నారట.

అదే సమయంలో పక్కనే ఉన్న మోహన్ బాబుతో 'పవర్ పాండి' రీమేక్ గురించి చర్చించారట రజనీ. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయనకు సలహా ఇచ్చారట. చూడాలి మరి తన చిరకాల మిత్రుడు రజనీ సూచనను మోహన్ బాబు ఎంతమేర ఆచరణలో పెడుతారో!

English summary
South indian superstar Rajinikanth watched the movie Power Paandi. After watching the film he gave a suggestion to his friend Mohanbabu to remake this
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu