Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజ్ తరుణ్‌కు గట్టిదెబ్బే పడింది.. కోత పెట్టేశారట!
సినీ పరిశ్రమలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఎంత పెద్ద హీరోనైనా, క్రేజీ హీరోయిన్ అయినా సక్సెస్ లేకపోతే ఎందుకు పనికిరారు అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఈ విషయంలో యువ హీరో రాజ్ తరుణ్ గానీ, మరొకరు గానీ మినహాయింపు కారు. తాజాగా వరుస పరాజయాల పాలైన రాజ్ తరుణ్‌పైనే ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్లిన సమయంలో దీపం ఉండగానే చక్క బెట్టుకొనే విధంగా రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడట. ప్రస్తుతం రాజుగాడు ఫెయిల్యూర్ తర్వాత తన గ్రాఫ్‌కు తగ్గట్టుగా సవరించే ప్రయత్నంలో ఉన్నారనేది సినీ వర్గాల సమాచారం.

వరుస సక్సెస్‌లతో భారీగా రెమ్యునరేషన్
ఉయ్యాల జంపాల చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను రాజ్ తరుణ్ ఆకట్టుకొన్నాడు. వరుస హిట్లపై హిట్లు పడటంతో మినిమం గ్యారెంటీ హీరో అనే పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దాంతో నిర్మాతలు యువ హీరో ముందు క్యూ కట్టారు. డిమాండ్ బాగా ఉండటంతో రాజ్ తరుణ్ రెమ్యునరేషన్‌ను భారీగా అందుకొన్నారు.

వరుస ఫ్లాప్‌లతో సతమతం
అంధగాడు తర్వాత రంగులరాట్నంతో రాజ్ తరుణ్‌కు గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమైంది. రంగులరాట్నం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే విషయం తెలిసిందే. ఇక తాజాగా రాజుగాడు సినిమా దారుణంగా తిరుగుటపా కట్టేసింది.

జాగ్రత్తలలో రాజ్ తరుణ్
ఇండస్ట్రీలో ఓ రేంజ్ హీరోకు రెండు ఫ్లాప్ పడ్డాయంటే జాగ్రత్త తీసుకోవాల్సిందే అనే సంకేతాలు మొదలవుతాయి. ఇప్పుడు రాజ్ తరుణ్‌కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. ఇప్పుడు కనుక సర్దుకోకపోతే అసలుకే మోసం వచ్చేలా ఉందని రాజ్ తరుణ్ గ్రహించారట.

స్క్రిప్టులపై యువ హీరో దృష్టి
వరుస ఫ్లాప్‌ల తర్వాత రాజ్ తరుణ్ స్వయంగా స్క్రిప్టులపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారట. తన సక్సెస్ రేటుకు తగినట్టుగా పారితోషికాన్ని కూడా తగ్గించడానికి సిద్ధమయ్యారట. రాజ్ తరుణ్ తీసుకొంటున్న జాగ్రత్తలపై సినీ వర్గాలు సానుకూలంగా స్పందించడం గమనార్హం.

సీ కల్యాణ్‌తో సినిమా
రాజుగాడు చిత్రం తర్వాత రాజ్ తరుణ్ నానుమ్ రౌడీ ధాన్ అనే రీమేక్ చిత్రంలో నటించనున్నారు. నిర్మాత సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.