»   » రవితేజ సూపర్ హిట్ సీక్వెల్ లో రామ్ చరణ్??

రవితేజ సూపర్ హిట్ సీక్వెల్ లో రామ్ చరణ్??

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రామ్ చరణ్ వరసగా సినిమాలు కమిటవుతున్నారు. తాజాగా ఆయన మరో చిత్రం కథ విని ఓకే చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన కిక్ చిత్రం సీక్వెల్ చేయటానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా సురేంద్రరెడ్డి వెళ్లి కథని నేరేట్ చేసి చెప్పాడని వెంటనే నచ్చినట్లు తెలియచేసాడని,త్వరలో ఈ చిత్రానికి సంభందించిన వర్క్ ప్రారంభమయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో చేస్తున్న రేసు గుర్రం షూటింగ్ ఫినిష్ కాగానే ఈ చిత్రం వర్క్ ప్రారంభం కావచ్చు.


  ఈ చిత్రం కాకుండా రామ్ చరణ్ తదుపరి చిత్రం నాగార్జునతో రీసెంట్ గా గ్రీకు వీరుడు వంటి ప్లాప్ చిత్రం అందించిన దశరధ్ తో అని తెలుస్తోంది. ఈ మేరకు దశరథ్ రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి ఓ కథ వినిపించారని, వెంటనే కథ ఓకే చేసారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దశరథ్ అదే స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ లోగా రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి చేసుకుని వస్తారని అంటున్నారు.

  మరో ప్రక్క 'జంజీర్‌' (తుఫాన్) రీమేక్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్‌చరణ్‌. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా విమర్శకుల చేత ఓ రేంజిలో కామెంట్స్ చేయించేలా చేసింది. అయితే పట్టువదలకుండా తాజాగా మరో చిత్రం చేయడానికి రామ్‌చరణ్‌ సన్నాహాలు చేసుకొంటున్నారని తెలిసింది.


  ఈ కొత్త బాలీవుడ్ చిత్రానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. 'జంజీర్‌' చిత్రీకరణ ముంబయిలో జరుగుతున్నప్పుడు చరణ్‌కి సల్మాన్‌ ఆతిథ్యం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఎవడు' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సెట్లో సల్మాన్‌ ఖాన్‌ సందడి చేశారు. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేస్తారనే ప్రచారం మొదలైంది.

  ఇటీవల రామ్‌చరణ్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2014 ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, జంజీర్ లో ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యారని, అది ఈ కొత్త చిత్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని సెట్స్ మీదకు వెళ్తారని చెప్తున్నారు.

  ఇక ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ కూడా రామ్‌చరణ్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో చరణ్‌ నటిస్తేనే బాగుంటుందని అశుతోష్‌ భావిస్తున్నారట. 'మగధీర' చిత్రాన్ని చూశాక ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకోసం ప్రత్యేకంగా మగధీర ప్రింట్ తెప్పించుకుని మరీ చూసాడని చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆయనతో చేయాలని ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. 'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...? రామ్ చరణ్ ఇక ఈ చిత్రం భారీవ్యయంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టు సమాచారం.

  English summary
  Latest reports now say that Charan is smitten by an action-comedy narrated by director Surender Reddy. Right now the 'Kick' director is directing Bunny's 'Race Gurram' and he is heard impressing Charan with his latest story. Sources revealed that this new story is actually a sequel of Surender Reddy's 'Kick' where Raviteja has excelled in an all-round show.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more