»   » ఎన్టీఆర్ నష్టాన్ని రామ్ చరణ్ రికవరీ?

ఎన్టీఆర్ నష్టాన్ని రామ్ చరణ్ రికవరీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో అప్పట్లో శక్తి అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ చిత్రం నిర్మాత అశ్వనీదత్ ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడ్డాడంటారు. ఆ తర్వాత ఆ నష్టాలు నుంచి బయిటపడేయటానికి అశ్వీనీదత్ తో ఎన్టీఆర్ చిత్రం ఉంటుందని వినిపించాయి కానీ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఆయన మళ్లీ సినిమా చేయలేదు.

అయితే చాలా గ్యాప్ తర్వాత అదే బ్యానర్ పై చిత్రం అశ్వనీదత్ చేయనున్నాడని వినిపిస్తోంది. ఈ సారి రామ్ చరణ్ హీరోగా సినిమాని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిరంజీవితో ఎన్నో హిట్స్ కొట్టిన ఆయన రామ్ చరణ్ లాంచింగ్ చిత్రం చిరుతని సైతం ప్రొడ్యూస్ చేసారు. ఇప్పుడు అదే అనుబంధంతో రామ్ చరణ్ డేట్స్ ఇస్తున్నాడంటున్నారు.

Ram Charan Maruthi going on

మరి ఈ చిత్రానికి డైరక్టర్ ఎవరూ అంటారా..మారుతి అని తెలుస్తోంది. మెన్నటి వరకు చిన్న సినిమాల డైరక్టర్ గా సాగిన ఆయన ప్రయాణం, భలే భలే మొగాడివోయ్ చిత్తరం తర్వా... స్టార్ డైరక్టర్ స్థాయికి చేరింది. ఆయన ప్రస్తుతం వెంకటేష్ తో బాబు బంగారం చిత్రం చేస్తున్నారు.

బాబు బంగారం తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ని కలిసి ఓ లైన్ వినిపించాడని, ఆయన సైతం ఇంప్రెస్ అయి మారుతితో చేయటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యే వాతావరణం కనిపిస్తోంది.

English summary
Buzz in Industry is that a project in the combination of Ram Charan-Maruthi-Ashwini Dutt is in the planning stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu