»   » ఎన్టీఆర్ కు శతృవు, ఇప్పుడు రామ్ చరణ్ కు ఫ్రెండ్

ఎన్టీఆర్ కు శతృవు, ఇప్పుడు రామ్ చరణ్ కు ఫ్రెండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ కు, తెలుగు హీరో నవదీప్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఏ పార్టీ ఇచ్చినా నవదీప్ తప్పకుండా ఉండాల్సిందే. అంతేకాదు చరణ్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నవదీప్ ది ప్రధమ స్దానం అని చెప్తారు. ఇప్పుడు ఆ నవదీప్..రామ్ చరణ్ కొత్త చిత్రం ధృవలో చరణ్ కు ఫ్రెండ్ గా కనిపించనున్నట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'తని ఒరువన్' చిత్రాన్ని'ధృవ' టైటిల్ తో తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే నవదీప్ ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా, ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ గా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వినపడుతోంది.

ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రామ్ చరణ్ మాత్రం చిత్ర షూటింగ్ లో పాల్గొన లేదు.

Ram Charan’s ‘Dhruva’ gets a new addition

అయితే రీసెంట్ గా ఈ చిత్రం శనివారం నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుండగా.. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. గచ్చిబౌలి లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా, అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.

సినిమాలో హీరో పాత్ర ట్రైనీ పోలీస్ కావడంతో, రోల్ కు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి టైం తీసుకున్నాడు చెర్రీ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చెర్రీ లేటెస్ట్ ఫోటో లు చూస్తే, బాడీ కోసం బాగానే కసరత్తు చేసినట్టు కనిపిస్తున్నాడు. మీసకట్టు, బ్లాక్ గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు చరణ్.

ధృవలో కూడా ఇదే లుక్ తో కనిపిస్తాడని సమాచారం. సినిమాలో తన పాత్రకోసం, చెర్రీ పూర్తి వెజిటేరియన్ గా మారడంతో పాటు, వర్కవుట్స్ లెవల్ ను పెంచుకుంటూ వెళ్లాడు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.


అలాగే నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది.

English summary
Navdeep was roped in to play one of the cops who is a close friend of the protagonist in Ram Charan’s next ‘Dhruva’ movie. He will be one of the two cops, who will be seen assisting Ram Charan and travels throughout the film with the hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu