»   » రూమర్ నిజమైంది...రామ్ చరణ్ తోనే నెక్ట్స్

రూమర్ నిజమైంది...రామ్ చరణ్ తోనే నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత సుకుమార్ ఏ చిత్రం చేస్తాడనే స్పెక్యులేషన్స్ కు దాదాపు తెరపడినట్లే అని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా సుకుమార్..డైరక్ట్ చేయబోయే లిస్ట్ లో అఖిల్ , రామ్ చరణ్, దేవిశ్రీప్రసాద్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఎక్కువగా రామ్ చరణ్ నే డైరక్ట్ చేసే అవకాసం ఉందని అన్నారు. దాన్ని నిజం చేస్తూ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం ఓకే అయిందని సమచారం. రామ్ చరణ్ చాలా కాలంగా సుకుమార్ తో చిత్రం చేయాలని భావిస్తున్నారు. వన్ నేనొక్కిడనే ఫెయిల్యూర్ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని అన్నారు. అయితే రకరకాల కారణాలతో అది మెటీరియలైజ్ కాలేదు.

Ram Charan under Sukumar Direction

అయితే ఇన్నాళ్లకు టైమ్ వచ్చిందని అంటున్నారు. రీసెంట్ గా సుకుమార్ వెళ్లి రామ్ చరణ్ ని కలిసి కథ చెప్పాడని అంటున్నారు. నేరేషన్ విన్న మరుక్షణంలోనే రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

ఇక రామ్‌చరణ్ మంచి దూకుడు మీద ఉన్నారని చెప్పాలి. 'బ్రూస్‌లీ' తర్వాత తమిళ హిట్ 'తని ఒరువన్' తెలుగు రీమేక్‌లో నటించడా నికి రామ్‌చరణ్ అంగీకరించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది.

Ram Charan under Sukumar Direction

ఇప్పుడు చెర్రీ ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. తెలివైన డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఓ అగ్రనిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరి.. 'తని ఒరువన్' రీమేక్‌తో పాటు సుక్కు చేయబోయే చిత్రం కూడా ఒకేసారి సెట్స్‌కి వెళుతుందా? ఆ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక ఈ చిత్రాన్ని మొదలుపెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒక సినిమా తర్వాత మరొకటి చేసినా మరో ఏడాదిలో ఈ రెండు చిత్రాలూ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Sukumar recently met Charan to discuss the possibility of working together. The director bounced a couple of stories he had in mind and Ram Charan was convinced that he would like to work with Sukumar,"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu