For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 'రెబల్' కథ ఇదేనా??

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన భారీ చిత్రం 'రెబల్' . ఈ నెల 28న అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తై ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. రికార్డు స్ధాయిలో ఓపినింగ్స్ తెచ్చుకుంటుందని బావిస్తున్న ఈ చిత్రం కి కథ అంటూ రకరకాలు స్టోరీలో ప్రచారంలోకి వస్తున్నాయి. వాటిలో ఓ స్టోరీ ఇది.

  ప్రభాస్ ఓ పెద్ద మాఫియా డాన్ (కృష్ణం రాజు) కొడుకు. ఆయన చాలా మంచి డాన్. ఆయన చిన్న కొడుకు మన హీరో ..అంటే రెబెల్. ప్రబాస్ మరో చోట తన తండ్రి కార్యక్రమాలకు దూరంగా హ్యాపీగా జీవితం గడుపుతూంటాడు. అతను ఓ అనాధ(దీక్షాసేధ్)తో ప్రేమలో పడతాడు. ఫస్టాఫ్ రొమాన్స్ తోనూ,బ్రహ్మానందం కామెడీతోనూ సాగుతుంది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి తండ్రి చనిపోయాడనే వార్త వస్తుంది. ఆ తర్వాత చనిపోలేదు చంపబడ్డాడు అనే విషయం తెలుస్తుంది.

  ఆ చావుకి లోకల్ గా ఉండే ప్రజల సమస్యతో లింక్ ఉంటుంది. తండ్రి ఆ ప్రజల కోసమే మరణించాడని తెలుస్తుంది. దాంతో అక్కడ నుంచి బయిలు దేరి తండ్రి కోసం వస్తాడు. అక్కడ తమన్నా ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ప్రబాస్ తన తండ్రి హత్యకు కారణమైన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు..తన తండ్రి ఆశయం ఎలా తీర్చాడన్న కోణంలో కథ నడుస్తుంది. అయితే ఇది నిజమా లేక రూమరా అనేది రేపు తేలుతుంది. గాఢ్ ఫాధర్ చిత్రం కథని కొద్దిగా మార్చి అల్లేసినట్లున్న ఈ కథ కరెక్టు కాదని కొందరంటున్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ... ''ఈ సినిమా నిర్మాణం విషయంలో మేం ఎక్కడా రాజీ పడలేదు. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ సినిమా. లారెన్స్ జనరంజకంగా ఈ సినిమాను తీశాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో క్లాస్ ఆడియన్స్‌కి చేరువైన ప్రభాస్ మళ్లీ తనదైన బాటలోకి వచ్చేసి ఈ పాత్ర చేశారు. 'ఛత్రపతి'ని మించే రేంజ్‌లో సినిమా ఉంటుంది. లారెన్స్ టేకింగ్, తమన్నా, దీక్షాసేథ్‌ల గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలువనున్నాయి. అభిమానుల అంచనాలకు అందని రేంజ్‌లో సినిమా ఉంటుంది. సెన్సార్ పూర్తయ్యింది. 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. తప్పకుండా విజయం సాధిస్తుందని మా నమ్మకం'' అన్నారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  
 Prabhas’ Rebel is all set to release worldwide on September 28th. The makers are making sure that the movie gets a record release every where. The movie was recently censored and was given A certificate. Here is the story of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X