»   » రామ్ చరణ్ కి బానే బ్యాండ్ పడింది

రామ్ చరణ్ కి బానే బ్యాండ్ పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ కి ఈ వేసవి మంట కన్నా తనకు పడ్డ పెనాల్టీ కి వచ్చే బాధతో కూడిన లోపలి మంట ఎక్కువైందిట. తన తండ్రి ఇన్వాల్వ్ మెంట్ కు ఫలితం తన రెమ్యునేషన్ కట్ అవటం రామ్ చరణ్ కి కాల్చేస్తున్నా...హిట్ వస్తుందనే ఆశతో ఓకే అనేసాడుట. ఐదు కోట్లు ఇందు నిమిత్తం చరణ్ బాబు...నిర్మాత బండ్ల గణేష్ కి తన రెమ్యునేషన్ లో తగ్గించుకున్నాడని ఫిల్మ్ నగర్ కోడై కోస్తోంది. మొదట ఈ రెమ్యునేషన్ కోతకు రామ్ చరణ్ నో అన్నాడట...కానీ తండ్రి చిరు కలగచేసుకోవటంతో.. రామ్ చరణ్ ఇష్టం ఉన్నా లేకుండా తల ఊపాల్సి వచ్చిందట. అయినా రీషూట్ లు పెట్టి,డబ్బు రికవరీ చేయకపోతే నిర్మాత నాకిపోడూ అంటున్నారు. ఇదంతా దేని గురించే మీకు అర్దమయ్యే ఉంటుంది.. లేకపోతే క్రింద స్టోరీ చదివేయండి.

రామ్ చరణ్ తన తాజా ప్రాజెక్టు గోవిందుడు అందరి వాడే చిత్రంలో రీసెంట్ గా కొన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వచ్చి ఆల్రెడీ షూట్ చేసిన సీన్స్ చూసి పెదవి విరిచి,రీ షూట్ పెట్టమన్నాడని వినికిడి. అంతేకాక రాజ్ కిరణ్ ని తొలిగించి ఆ ప్లేసులో ప్రకాష్ రాజ్ ని రప్పించాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్, రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు మళ్లీ రీ షూట్ చేస్తున్నారు.

 Rs 5crore Penalty for Ramcharan

ఇదంతా గమనించిన దర్శకుడు కృష్ణ వంశీ టెన్షన్ పడిపోయి హాస్పటిల్ పాలయ్యాడట. తనను నమ్మి వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ కు బడ్జెట్ పెరిగిపోవటం తట్టుకోలేకపోయాడట. దాంతో రామ్ చరణ్ తన రెమ్యునేషన్ లో కొంత భాగం త్యాగం చేయటానికి ముందుకు వచ్చాడని తెలుస్తోంది. రీ షూట్ కి అయ్యే మొత్తం తన రెమ్యునేషన్ నుంచి మినహాయించుకోమన్నాడని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్‌. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్‌, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే.

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్ . శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ''ఈ షెడ్యూల్‌లో కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. అనంతరం లండన్‌లో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రకాష్‌రాజ్‌, జయసుధలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్‌ శంకర్‌రాజా ఇప్పటికే మూడు పాటల్ని రికార్డ్‌ చేశారు''అన్నారు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan has to return back Rs.5crore from his remuneration to cut down the troubles he and his father caused to producer, Bandla Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu