»   » చిరంజీవి పాట రీమిక్స్ చేస్తూ సదా ఐటం సాంగ్

చిరంజీవి పాట రీమిక్స్ చేస్తూ సదా ఐటం సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాత హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయటం ఈ మధ్య సినిమాల్లో ఓ ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా చిరంజీవి పాత పాటలు ఎక్కువ రీమిక్స్ అవుతున్నాయి. తాజగా చిరంజీవి మరో సూపర్ హిట్ సాంగ్... " అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం...నింగీ నేలా చుంబించే లాలిలో..." సైతం రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో సూపర్ హిట్ గా నిలిచిన పాట ఇది. ఈ పాటను యమలీల సీక్వెల్ చిత్రంలో పెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం.

అలాగే ఈ పాటకు సదా డాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జయం నుంచి అపరిచితుడు చిత్రం దాకా కంటిన్యూగా దాదాపు 30 సినిమాలు దాకా చేసుకుంటూ పోయిన సదా ఆ తర్వాత చల్లబడిపోయింది. ఆమె కెరీర్ పూర్తిగా క్లిక్ లాంటి హర్రర్ సినిమాల స్ధాయికి పడిపోయింది. అప్పటికీ శ్రీకాంత్ సరసన ఆమె అఆఇఈ వంటి సినిమాలు చేసినా అవి డిజాస్టర్ అయ్యి ఆమెను మరింత పడేసాయి. దాంతో ఆమె ఇక్కడ లాభం లేదనుకుంది కన్నడ పరిశ్రమకు వెళ్లి సెటిలైంది. అక్కడా పెద్దగా కలిసిరాకపోవటంతో ఇప్పుడు మళ్లీ ఈ రకంగా ఐటం సాంగ్ తో మళ్లీ తన కెరీర్ ని మొదలు పెట్టాలనుకుంటోంది.

Sada item song in Yamaleela 2

రీసెంట్ గా... ఓ ద్విభాషా చిత్రంలో సదా ఐటం సాంగ్ చేసింది. విశాల్‌ హీరోగా గా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, వరలక్ష్మి హీరోయిన్స్ . సుందర్‌.సి. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సదా ఓ ప్రత్యేకగీతంలో నర్తించింది. అయితే తాను చేసింది ఐటెమ్‌ సాంగ్‌ కాదు అంటోంది సదా. సదా మాట్లాడుతూ ''దాంట్లో కేవలం గీతంలో నర్తించేందుకే పరిమితం కాలేదు. కథలో భాగంగా ఓ సన్నివేశం కూడా నాపైన వస్తుంది. ఇదో ప్రత్యేక పాత్ర అనుకొంటున్నాను'' అని చెప్పింది. అయితే ఐటం సాంగ్ లు చేయటంలో తప్పేముంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్నవే కదా..అందులో అయినా మన ప్రతిభ కనపడటం ముఖ్యం అంటున్నారు సినీ జనం.

ఇక 1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సదా,నిషా కొఠారి ఎంపిక అయినట్లు సమాచారం. మోహన్ బాబు యమధర్మరాజు గా కనిపించనున్నారు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. హీరోగా కొత్త కుర్రాడిని ఎంపిక చేసారని వినికిడి.

ఇక చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందమే చేస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ స్క్రిప్టు వర్క్ లోనే ఎస్వీ బిజీగా ఉన్నారు. సీక్వెల్ గా ఈ చిత్రం బిజినెస్ పరంగానూ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ తరం యువత పల్స్ ని ఎంత మేరకు పట్టుకోగలుగుతాడనే విషయంపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుందనేది మాత్రం.

English summary
Sada is doing a special song in Yamaleela 2 under SV.Krishna Reddy's direction. She will be seen in the remix of Mega Star Chiranjeevi's super hit song Andalalo Aho Mahodayam from Jagadeka Veerudu Atiloka Sundari. Mohan Babu is playing lead role in Yamaleela 2 while Ali starred in Yamaleela.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu