»   » మెగా రూమర్స్: సాయి ధరమ్ తేజ్-నిహారిక పెళ్లి? నిజమా?

మెగా రూమర్స్: సాయి ధరమ్ తేజ్-నిహారిక పెళ్లి? నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ న్యూస్ ఇపుడు మెగా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ రూమర్ మరెవరి గురించో కాదు.... మెగా ఫ్యామిలీకి చెందిన బావ మరదళ్లు సాయి ధరమ్ తేజ్, నిహారిక గురించే. త్వరలో వీరు పెళ్లి జరుగబోతున్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ.... యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్, నిహారిక ఒకరినొకరు ఇష్టపడుతున్నారని... దీంతో ఇద్దరి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సుముఖంగా ఉన్నారని టాక్.

ఒక మనసు సమయంలో ఒక్కటైన మనసులు?

ఒక మనసు సమయంలో ఒక్కటైన మనసులు?

నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతూ నటించిన ‘ఒక మనసు' సినిమా షూటింగ్ సమయంలో సాయి ధరమ్ తేజ్, నిహారిక ను కలవడానికి తరచూ వెల్లే వాడని, ఈ సమయంలో వీరి మనసులు కలిసాయని ప్రచారం జరుగుతోంది.

నిహారిక సినిమాకు సాయి ధరమ్ తేజ్ నిర్మాతగా?

నిహారిక సినిమాకు సాయి ధరమ్ తేజ్ నిర్మాతగా?

మరో షాకింగ్ రూమర్ ఏమిటంటే.... త్వరలో నిహారిక హీరోయిన్ గా నటించబోయే సినిమాకు సాయి ధరమ్ తేజ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. వినడానికి ఇవేవీ నమ్మశక్యంగా లేక పోయినా సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏమో? జరిగినా జరుగుండొచ్చు?

ఏమో? జరిగినా జరుగుండొచ్చు?

అయితే ఈ రూమర్స్ విన్న మెగా అభిమానులు..... అయోమయంలో పడ్డారు. బావ మరదళ్లు కాబట్టి, చిన్నతనం నుండి ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి, ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉండొచ్చు. వరుస కుదురుతుంది కాబట్టి.... వీరి వివాహం జరిగినా జరుగొచ్చు? అలా జరిగితే తమకూ ఆనందమే అంటున్నారు.

క్లారిటీ రావాల్సి ఉంది.

క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం రూమర్స్ గానే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయమై క్లారిటీ వస్తే తప్ప..... ఇలాంటి గాలి వార్తలను, సోషల్ మీడియా ప్రచారాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిదని మరికొందరి వాదన.

English summary
Rumors rounded in film nagar circles that Mega Family hero Sai Dharam Tej And Niharika Is Getting Married soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu