»   » పూరీ 'హార్ట్‌ఎటాక్‌' గెస్ట్ రోల్ లో హిందీ స్టార్

పూరీ 'హార్ట్‌ఎటాక్‌' గెస్ట్ రోల్ లో హిందీ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరీ జగన్నాథ్, నితిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. చాలా చిన్న పాత్ర అయినా కథను మలుపు తిప్పేదని అంటున్నారు. మొదట తెలుగులో వేరే హీరో అనుకున్నా తర్వాత...ఈ హిందీ స్టార్ తో లాగించేసారని చెప్పుకుంటున్నారు. సైఫ్ కు పూరీ కి గతంలో ఉన్న పరిచయం దృష్ట్యా కొద్ది సేపు తెలుగు తెరపై కనపడటానికి ఒప్పుకున్నాడంటున్నారు. ఇది నిజమా కాదా తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''ఒక దర్శకుడిగా, నిర్మాతగా నాకు పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రమిది. 'ఇడియట్‌', 'అమ్మానాన్న ఓ తమిళమ్మాయి', 'పోకిరి' చిత్రాల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నా మనసుకు చేరువైంది. నితిన్‌ సినీ జీవితంలో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. అనూప్‌ స్వరపరిచిన గీతాలు చాలా బాగున్నాయి. పాటల వేడుకని వైవిధ్యంగా నిర్వహించబోతున్నాం. వచ్చే నెల మొదటివారంలో పాటల్ని విడుదల చేస్తాం''అన్నారు.

Sai

అలాగే కథ గురించి చెప్తూ...ఆ అమ్మాయంటే చాలా చాలా ఇష్టం. ఎంతిష్టమో వర్ణించలేక ముద్దడిగేశాడు ఓ కుర్రాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెరపైనే చూడాలంటున్నారు పూరి జగన్నాథ్‌. ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. నితిన్‌, అదాశర్మ జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

''పూరి జగన్నాథ్‌గారితో ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది. 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం నా ప్రయాణానికి మేలి మలుపు అవుతుంది''అన్నారు నితిన్‌. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, సమర్పణ: లావణ్య.

English summary
According to sources Saif Ali Khan is doing a special cameo in Heart Attack movie. Puri Jagannadh had directed Heart Attack movie along with producing the movie on Puri Jagannadh Touring Talkies and he is also releasing this flick audio on his music company Puri Sangeet. Heart Attack is schedule for release on 31st Jan, 2014, let’s see how much Saif will impress Tollywood audiences in his debut film down south.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu