»   » కొడుకు కోసం సాయికుమార్ పడరాని పాట్లు

కొడుకు కోసం సాయికుమార్ పడరాని పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైలాగ్‌కింగ్‌గా నటుడు సాయి కుమార్‌కు మంచి పేరుంది. అయితే హీరోగా మాత్రం నిలదొక్కు కోలేక పోయాడు. పోలీస్ స్టోరీ మినహా సాయి కుమార్‌కు అచ్చొచ్చిన సినిమాలేవీ లేవు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయి పోయాడు. తన కోరిక ఎలాగూ తీర‌లేదు కాబట్టి తన కొడుకు ఆదిని హీరోగా నిలబెట్టి గర్వ పడాలని ఆశ పడ్డాడు. హీరోగా తీర్చి దిద్దాడు. అనుకున్నట్లుగానే ఆది 'ప్రేమ కావాలి" సినిమాలో అదర గొట్టాడు.

ఆ సినిమా మంచి విజయం సాధించినా ఆదికి మాత్రం మళ్లీ సినిమా అవకాశాలు రావడం లేదు. టాలెంట్ ఉన్నప్పటికీ ఆది అగ్రహీరో కొడుకు కాక పోవడమే ఇందుకు కారణం కాబోలు. టాలెంట్‌తో సంబంధం లేకుండా నందమూరి, అక్కినేని, మెగా కుటుంబాల నుంచి వచ్చిన హీరోల తనయులతో సినిమాలు తీయడానికి ఎగబడుతున్న నిర్మాతలు, అన్నీ ఉన్నా ఆది‌కి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకూ...అంటే సాయి‌కుమార్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్దగా లేక పోవడమే. సినిమా హిట్టయినా పెద్దగా డబ్బులు రావనేది నిర్మాతల ఆలోచన కాబోలు.

ఈ విషయం గమనించిన సాయి‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగి ఆదికి అవకాశాలు వెతికి పెట్టే పనిలో పడ్డాడు. ఇండ్రస్ట్రీలో అందరితో పరిచయాలు ఉండటంతో ప్రతి ఒక్కరికి కలిసి ఆదికి అవకాశం ఇప్పించాలని అడుగుతున్నాడట. పాపం సాయి కుమార్ తన కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కూడా ఇలాంటి పడరాని పాట్లు పడలేదేమో..?

English summary
Aadi’s debut film ‘Prema Kavali’ was forcibly called a hit and though he has shown good confidence and has enough skills, luck has been eluding him. Now, the cine folks reveal Sai Kumar is literally begging his close sources to give his son one more chance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu