»   » ఆ రీమేక్ కోసం బాలయ్య, గోపీచంద్ ల మధ్య పోటీ!?

ఆ రీమేక్ కోసం బాలయ్య, గోపీచంద్ ల మధ్య పోటీ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ గా బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రంపై తెలుగులో పెద్ద నిర్మాతల దృష్టి పడింది. దాంతో ఆ చిత్రం రీమేక్ రైట్స్ ని తీసుకుని తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ చిత్రం చూసిన గోపీచంద్..తాను కరెక్టుగా ఆ పాత్రకు సరిపోతానని భావించి రైట్స్ కోసం తనతో చిత్రం చేస్తానని వచ్చిన నిర్మాతను ముంబై తరిమాడట. మరో ప్రక్క బాలకృష్ణకు క్లోజ్ గా ఉండే నిర్మాత ఒకరు ఈ సబ్జెక్టు బాలకృష్ణకు కరెక్టుగా సరిపోతుందని భావించి, రీమేక్ రైట్స్ కోసం తన లెవెల్లో ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు. అంతేగాక జయంత్.సి.పరాంన్జీ కూడా దబాంగ్ ని రీమేక్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణకు సూచించాట్ట. దాంతో ఎన్నడూ లేని విధంగా మంచి పోటీ రావటంతో దబాంగ్ హీరో సల్మాన్ మంచి ఉషారుగా ఉన్నాడు. మరో ప్రక్క ఈ చిత్రం వందకోట్లు దాటటం కూడా మన నిర్మాతల్లో ఆశను కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలైన త్రీ ఇడియట్స్, లన్ ఆజ్ కల్ తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలాగే ఈ పోటీలో ఈ రీమేక్ ని బాలయ్య సొంతం చేసుకుంటాడా లేక గోపీచంద్ హస్తగతం చేసుకుంటాడా, వీరిద్దరినీ కాదని మరో హీరో సీన్ లోకి వస్తారా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఇంతకీ ఎవరికీ ఈ రీమేక్ దక్కే అవకాసం ఉందంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu