»   » ఆడవాళ్లకి మర్యాద ఇవ్వని వీడు ఒక సూపర్ స్టారా..!?

ఆడవాళ్లకి మర్యాద ఇవ్వని వీడు ఒక సూపర్ స్టారా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇమేజ్ పరంగా ఎంతటి సూపర్ స్టార్ అయినా కానీ క్యారెక్టర్ పరంగా నీచాతి నీచుడని పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. మరోసారి తన బుద్ది బయటపెట్టుకున్నాడు. ఓ తమిళ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకకి వచ్చిన సల్యాన్ ఖాన్ ఆటోగ్రాఫ్ తీసుకునేందకు ఓ యువతి స్టేజి మీదకు వెళ్లింది. అక్కడే ఉన్న సల్మాన్ బాడీగార్డ్ చేతికి తన ఫోన్ ఇచ్చి వాళ్లిద్దరినీ ఒక ఫోటో తీయమంది. దాంతో ఆ బాడీగార్డ్ ఆమెని ఒడిపి పట్టుకుని స్టేజ్ మీదినుంచి ఈడ్చుకుని వెళ్లిపోయాడు. ఇదంతా సల్మాన్ కన్నార్పకుండా చూశాడే తప్ప తన బాడీగార్డుని వారించలేదు.

సల్మాన్ బుద్దిని చూసిన వారు 'ఆడవాళ్లకి మర్యాద ఇవ్వని వీడు ఒక సూపర్ స్టార్" అటూ బహిరంగంగానే కామెంట్ చేశారు. తనని చూడ్డానికి ఆశగా వచ్చే అభిమానుల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం, చేయించడం సల్మాన్ కి కొత్తేమీ కాదు. చివరకు ఆడవాళ్లని కూడా అతను గౌరవించలేకపోతే ఎవరిని గౌరవిస్తాడు? ఇతని బుద్ది కారణంగానేమో సల్మాన్ తో అఫైర్ పెట్టుకున్న ఏ ఒక్కరూ అతనితో చిరకాలం ఉండలేకపోయారు. వ్యక్తిగా ఇలాంటి పనులు చేస్తూ ఎంత సంఘ సేవ చేస్తే మాత్రం ఏమి లాభం అంటూ సల్మాన్ ని దగ్గర్నుంచి చూసినవారంటున్నారు.

English summary
Being Human might be the name of his NGO, but Bollywood superstar Salman Khan's behaviour was far from that during the recent audio launch of Markandeyan, for which he was present.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu