»   » పవన్ కళ్యాణ్ కూడా.... ఛలో అమరావతి?

పవన్ కళ్యాణ్ కూడా.... ఛలో అమరావతి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య తాను నటించిన ‘డిక్టేటర్' ఆడియో ఫంక్షన్ కొత్త ఏపీ రాజధాని అమరవాతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా ఛలో అమరావతి అంటూ ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్ ఫంక్షన్ అమరావతిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

200% టేబుల్ ప్రాఫిట్: సర్దార్లో...పవన్ వాటా ఎన్నికోట్లు?

సధారణంగా అయితే పవన్ కళ్యాణ్ తన సినిమా ఆడియో ఫంక్షన్లను పెద్దగా చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ సారి మాత్రం ఈ ఆడియో ఫంక్షన్ మెగా వేడుకలా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకు మెగా హీరోలంతా హాజరవుతున్నట్లు టాక్. ఈ మేరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ వేడుకకు తగిన ప్రాంతం కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే మార్చ్ 12న పెద్ద ఎత్తున ఆడియో వేడుక నిర్వహిస్తారని టాక్. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వస్తే తప్ప ఏ విషయం అనేది నమ్మలేం.

పవన్ ,మహేష్, బన్ని .. ఓ 500 కోట్లు

Sardaar Gabbar Singh

సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు చివరి దశకు చేరుకోవడంతో....ప్రస్తుతం పాటల చిత్రీకరణ మొదలు పెట్టారు. కొన్ని పాటలు ఇక్కడే చిత్రీకరించనున్నారు. రెండు పాటలు మాత్రం యూరఫ్ లో ప్లాన్ చేస్తున్నారు. మార్చి చివరి వారంలో యూరఫ్ లో సాంగ్ చిత్రీకరణ జరుగబోతోంది. యూరఫ్ షెడ్యూలే సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ కాబోతోంది. ఈ లోగా బ్యాలెన్స్ సాంగ్స్, మరికొన్ని మిగిలిపోయిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సినిమాలో ఎంటర్టెన్మెంట్ పార్టు ఓ రేంజిలో ఉంటుందని... అలీ, బ్రహ్మాజీ తదితరులతో కలిసి పవన్ కళ్యాణ్ పండించే కామెడీ సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. మరో వైపు ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉన్నాయట.

ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు 90 శాతం పూర్తయింది. ఆల్రెడీ లక్ష్మీరాయ్ తో ఐటం సాంగ్, కాజల్ తో సాంగు కూడా పూర్తయింది. పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూసింగ్ సాంగును వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతోంది.

English summary
Film Nagar source said that, Sardaar Gabbar Singh’s audio in Amaravathi, the new capital of Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu