»   » జూ ఎన్టీఆర్ అదుర్స్ ఎటాక్స్ వెనక సీక్రెట్!?

జూ ఎన్టీఆర్ అదుర్స్ ఎటాక్స్ వెనక సీక్రెట్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హీరోగా చేసిన అదుర్స్ చిత్రంపై జరిగిన దాడుల గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ గమ్మత్తైన టాక్ వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం అదుర్స్ నిమిత్తం ఇన్యూరెన్స్ కంపెనీల నుంచి మొత్తం రాబట్టేందుకే నిర్మాతలు దాడులకు ప్రేరేపించారని అంటున్నారు. మోహన్ బాబు సలీం చిత్రంపై దాడులు జరగటంతో పది కోట్ల రూపాయల వరకూ ఇన్సూరెన్స్ మొత్తం వచ్చిందని వారు చెప్తున్నారు. అలాగే అదుర్స్ చిత్రాన్ని కూడా భారీ మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేసారని, అందుకే నిర్మాత తెలంగాణ అంశంపై కామెంట్ చేసారని, అది అందుకుని దాడులు,నిరశనలు జరగాయని అంటున్నారు. అది చూబెట్టే తర్వాత ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే దాడులు జరిగిన మరుసటి రోజు తమ వ్యూహం ఫలించిందని నిర్మాతలు పెద్ద పార్టీ చేసుకున్నారని అంటున్నారు. అయితే అది నిజమా కాదా అన్నది ఇన్సూరెన్స్ మొత్తం వస్తేగాని తెలియదు. ఈ వార్త నిజమే అయితే సినిమాలపై దాడి చేసే ముందు ఆంధోళన కారులు తమని పరోక్షంగా రెచ్చగొట్టి లబ్ది పొందుతున్నారనే విషయం తెలుసుకోవాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu