»   » ఛార్మి హిట్ సినిమాకు సీక్వెల్

ఛార్మి హిట్ సినిమాకు సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : ఛార్మింగ్ ఛార్మీ ఎన్నో చిత్రాలు చేసినా 'మంత్ర' చిత్రంతో వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి నంది అవార్డు కూడా దక్కింది. అయితే నంది అవార్డు వచ్చిన హీరోయిన్లకు అవకాశాలు ఉండవన్న మాట ఛార్మీ విషయంలో కూడా నిజమైంది. నంది అవార్డు ఇచ్చి ఇంటికి పంపించినట్టుగా అయింది.


  'మంత్ర' తర్వాత ఛార్మి ఎన్ని చిత్రాల్లో తన అందాలను చూపినా ఎవరూ పట్టించుకోలేదు. 'నగరం నిద్రపోతున్న వేళ', 'సై ఆట' లాంటి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ తర్వాత ఐటమ్ సాంగ్‌లు కూడా చేయడానికి ఛార్మీ సిద్ధమైంది. అయినా కానీ ఫలితం శూన్యం.

  ఆ తర్వాత 'మంత్ర' దర్శకుడు ఓషో తులసీరామ్‌తో 'మంగళ' అంటూ వచ్చినా అది మంగళం పాడింది. ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలోనే మూడో సినిమా చేయబోతోంది. అయితే ఈసారి 'మంత్ర'కు సీక్వెల్‌గా చేస్తున్నారని సమాచారం. 'మంత్ర' టీమంతా ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతోనైనా ఛార్మీ మరోసారి తన అదృష్టాన్ని మార్చుకోగలదేమో చూడాలి.

  English summary
  The news is abuzz with the sequel to Charmys's Mantra. The sequel to Charmy's one of the most successful films, Mantra will reportedly be produced and directed by Tulasiram. The Punjabi kudi Charmy wanted to become a hot heroine. She did have her fair share of success but all that was in the past. Charmy did not enjoy success with her recent films and even the much publicized Mangala has not done much for hr career.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more