»   » సిద్ధార్థ-సమంత పెళ్లి మ్యాటర్ లో మరో స్టెప్

సిద్ధార్థ-సమంత పెళ్లి మ్యాటర్ లో మరో స్టెప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిద్ధార్థ-సమంత పెళ్లి బాజా ఎప్పుడైనా మోగొచ్చని అంటున్నాయి సినీ వర్గాలు. ఇదే విషయమై వారిద్దరికి సంబంధించిన వార్తలు కొద్దినెలలుగా షికార్లు చేస్తున్నాయి. అడపాదడపా సిద్ధార్థ వాటిని ఖండిస్తున్నా సమంత మాత్రం నోరు మెదపటం లేదు. ఈ నేపథ్యంలో మరో వార్త కోడంబాక్కంలో జోరుగా చక్కర్లు కొడుతోంది.

సిద్ధార్థ తన తల్లిదండ్రులకు సమంతను పరిచయం చేస్తే నచ్చిందని వారు కూడా ఆనందం వ్యక్తం చేశారట. వారి మెప్పుతో సమంత కూడా ఆనందంలో మునిగి తేలుతోందట. వారి పెళ్లి కబురు ఎప్పుడైనా వెలువడే అవకాశాలున్నాయని అంటున్నాయి సినీవర్గాలు. అయితే ఎప్పటిలాగేనా వాళ్లిద్దరూ ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు.

ఈ విషయమై సిద్దార్ధ ఆ మధ్య ట్వీట్ చేస్తూ...." నా ప్రెవేట్ లైఫ్ కి చెందిన రూమర్స్...గురించి అయితే నేనే ఏదన్నా చెప్పుకోతగ్గ విషయం ఉంటే షేర్ చేసుకుంటాను... అలా రూమర్స్ వ్యాపింప చేయటం మాత్రం పద్దతి కాదు...." అని ట్వీట్ చేసారు. అయితే సమంత లవ్ ఎఫైర్ విషయమై మాత్రం ఆయన ఖండించకపోవటం గమనార్హం.

సమంత మీడియాతో మాట్లాడుతూ... తన పర్సనల్ లైఫ్ గురించి చర్చించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. 'అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరో మూడు సంవత్సరాల తర్వాత అని వెల్లడించింది.

English summary
Whole world is buzzing that Siddharth and Samantha are in a loving relationship. Siddharth introduced Samantha to his family and his parents like the girl.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu