»   » ఇంకా తేల్చట్లేదే?: ఓవైపు వాళ్ల దూకుడు.. బన్నీ మాత్రం ఇలా?

ఇంకా తేల్చట్లేదే?: ఓవైపు వాళ్ల దూకుడు.. బన్నీ మాత్రం ఇలా?

Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద సంవత్సరానికి రెండుసార్లు బొమ్మ పడితే తప్ప.. అభిమానులతో లింక్ తెగిపోకుండా ఉంటుంది. రెండింటిలో ఒకటి ఫట్టయినా.. ఇంకొకటైనా హిట్టవ్వకపోదా? అని అభిమానులూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ సంవత్సరంలో ఒకే సినిమాతో సరిపెడితే మాత్రం హీరో గారి లెక్కల్లో తేడాలొచ్చేయడం ఖాయం. అందుకే చాలా కాలం పాటు సంవత్సరానికి ఒక సినిమాతోనే సరిపెట్టుకొచ్చిన మహేష్ సైతం రూట్ మార్చాడు. రెండేళ్ల‌కు క‌నీసం మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ బన్నీ మాత్రం.. ఏడాదికో సినిమా లెక్కన ఇంకా 'స్లో' గానే ఉన్నాడంటున్నారు..

అది చిన్న సమస్యే, ఏం పరవాలేదు!

నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..

తదుపరి సినిమాపై 'నో క్లారిటీ'..:

తదుపరి సినిమాపై 'నో క్లారిటీ'..:

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య'తో బిజీగా ఉన్నాడు బన్నీ. మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే, ఇంకో నెలన్నర గడువు మాత్రమే ఉంది. చేతిలో ఉన్న సినిమా పూర్తవుతున్నా.. తదుపరి సినిమాపై మాత్రం బన్నీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.

వెయిటింగ్‌లో కొరటాల:

వెయిటింగ్‌లో కొరటాల:

నిజానికి బన్నీతో సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ఓ కథ కూడా వినిపించారు. కథ విన్న బన్నీ మాత్రం ఇంకా ఏది తేల్చలేదు. ప్రస్తుతం కొరటాల మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బహుశా.. ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూశాకే కొరటాలతో కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాడేమో!

అప్పటిదాకా కొరటాల ఆగుతాడా?:

అప్పటిదాకా కొరటాల ఆగుతాడా?:

బన్నీ సంగతి సరే గానీ.. ఆయన ఓకె చేసేదాకా కొరటాల ఆగుతాడా? లేడా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈలోగా మరే హీరో అయినా కొరటాలకు కబురు పెడితే.. ఆయన కూడా మళ్లీ బిజీ అయిపోవచ్చు. అదే జరిగితే.. బన్నీతో సినిమా చేయడానికి మరో ఏడాది పట్టవచ్చు.

వాళ్లేమో దూకుడుగా.. బన్నీ మాత్రం 'స్లో':

వాళ్లేమో దూకుడుగా.. బన్నీ మాత్రం 'స్లో':

సినిమాల ఎంపిక విషయంలో బన్నీ ఇంత స్లో గా ఉంటే.. తోటి హీరోలు రాంచరణ్, ప్రభాస్, మహేష్ లాంటి వారు మాత్రం కాస్త దూకుడుగానే ఉంటున్నారు. రిలీజ్ ల సంగతి పక్కనపెడితే.. కమిట్‌మెంట్ల విషయంలో మాత్రం ముందే ఉంటున్నారు. ఓ సినిమా సెట్‌పై ఉండగానే తదుపరి సినిమాకు సైన్ చేసేస్తున్నారు.

సాహో చేస్తుండగానే రాధా కృష్ణకుమార్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇక రాంచరణ్ కూడా రంగస్థలం సెట్‌పై ఉండగానే బోయపాటికీ, రాజమౌళికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మహేష్ సైతం 'భరత్ అనే నేను' సెట్‌ పై ఉండగానే వంశీ పైడిపల్లితో కమిట్ అయిపోయాడు. ఇలా అగ్ర హీరోలంతా కమిట్‌మెంట్స్ విషయంలో కాస్త దూకుడుగా ఉంటే బన్నీ మాత్రం.. నిధానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

English summary
Stylish Star Allu Arjun is shooting for a film 'Naa Peru Surya', directed by Vakkantham Vamshi, presently. But There has been no clarity over the Stylish star's next after this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu