»   » రెండో పెళ్లికి ఒప్పకున్న హీరో సుమంత్

రెండో పెళ్లికి ఒప్పకున్న హీరో సుమంత్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అక్కినేని సినీ వారసుల్లో ఒకరైన సుమంత్ ఆ మధ్య తన సహచర నటి కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయి విడాకులు తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన కీర్తి విడిగా బ్రతుకుతుంటే, సుమంత్ ఒంటరి జీవితం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు గోకుతూ.. టైం పాస్ చేస్తూ లైఫ్‌ను లాగించేస్తున్నాడనే వార్తలు కూడా లేక పోలేదు. అయితే సుమంత్ ఇలా ఒంటరిగా జీవితస్తూ, జీవితంపై బాధ్యత లేకుండా ఉండటాన్ని కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
  ఈ నేపథ్యంలో సుమంత్ మామయ్య నాగార్జున ఈ విషయమై క్లాస్ పీకినట్లు సమాచారం. ఇంకా ఎంత కాలం ఇలా మోడు బారిన జీవితం గడుపుతావు? జీవితంలో నీకంటూ ఓ తోడూ, నీడా అవసరం లేదా? ఇలా అయితే ఓ వయసు వచ్చాయ చాలా బాధ పడతావు, ఆ పరిస్థితి రాక ముందే తేరుకో...అంటూ లెక్చర్ ఇచ్చినట్లు సమాచారం.

  మామయ్య ఇచ్చిన క్లాస్‌తో బాధ్యత గ్రహించిన సుమంత్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తూంది. సుమంత్ లో సడన్ చేంజ్ ను చూసి ఇంటిల్లి పాది ఆనందంగా ఉన్నారట. సుమంత్ మనస్తత్వానికి, తమ కుటుంబ వాతావరణానికి సెట్ అయ్యే గుంట కోసం వెతుకులాట ప్రారంభించారని తెలుస్తోంది. సుమంత్ సోదరి సుప్రియ ఈ విషయాన్ని దగ్గరుండి పరిశీలిస్తుందట. తమకు తెలిసిన వారి, సన్నిహితుల ఇళ్లలో సుమంత్‌కు సరిపోయే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మనం సుమంత్ రెండో పెళ్లిని చూడబోతున్నాం.

  English summary
  Nagarjuna has taken a lengthy special class on this subject to Sumanth. With his favourite ‘Mamayya’ preaching him, Sumanth has reluctantly agreed to give a green signal to marriage, as per reports. Sources say he has also entrusted the responsibility of finding a suitable girl to his family members.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more