»   » సునీల్ కు ఆపరేషన్

సునీల్ కు ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ హీరోగా మారిన కమిడియన్ సునీల్ త్వరలో చిన్న ఆపరేషన్ చేయించుకోనున్నారని టాక్. అరికాలు ప్రాంతంలో చిన్న ఇబ్బంది ఉండటం వల్ల, దాన్ని తొలిగించుకునేందుకు ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

తన డాన్స్ లతో సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సునీల్...తీవ్రంగా డాన్స్ లు చేయటంలో కాలి నొప్పి సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడని, అందుకనే సర్జరీకి వెళ్తున్నాడని తెలిసిందే. శస్త్ర చికిత్స జరిగాక కానీ ఆయన కొత్త సినిమాలు ఏమీ ప్రారంభం కాకపోవచ్చు అంటున్నారు. ఈ ఆపరేష్ తర్వాత బి.జయ సినిమా ప్రారంభమయ్యే అవకాసం ఉంది.


ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం. అలాగే సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బిందాస్,రగడ చిత్రాల దర్శకుడు వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రానికి ' ఫ్రెండ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం సునీల్...భీమవరం బుల్లోడు టైటిల్ తో చిత్రం చేస్తున్నాడు. కలిసుందాం రా ఫేమ్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే సునీల్ రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలోనూ మరో చిత్రం కమిటయ్యారు.

English summary
Sunil will soon under go operation. This is not for any film shooting but in real life. Sources say since he was facing some difficulty in dancing due to pain in his legs, on doctors advice he decided to undergo surgery. Doctors say it is a minor surgery and there is nothing to worry. Sunil will start shooting for his films after the surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu