»   » వానిష్ పౌడర్ తో మళ్ళీ ముఖానికి రంగు వేసి శ్రీదేవి!

వానిష్ పౌడర్ తో మళ్ళీ ముఖానికి రంగు వేసి శ్రీదేవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అతిలోకసుందరి ఎవరు అంటే వెంటనే ఎవరైనా చెప్పేది శ్రీదేవి పేరే. ఆమె నిజంగా ఇంద్రుడి కూతురు ఇంద్రజ ఇలానే ఉంటుంది అనేంతగా అగుపించే తార శ్రీదేవి. ఆమె కొంతకాలం పాటు నెంబర్ వన్ తారగా వెలిగి పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రీదేవి ముఖానికి రంగు వేసుకుంటుంది ఏ సినిమాలో చేస్తుంది? అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరబాటే. ఆమె యాక్ట్ చేస్తున్నది సినిమాలో కాదు ఓ వాణిజ్య ప్రకటనలో యాక్టర్లకి నటన ప్రాణం అది వారి రక్తంలో పరుగులు పెట్టిస్తుంటే ఎంతకాలం అని కూర్చోగలరు. అలా కూర్చుని తింటే కొండలైనా కరుగుతుంది అనే సామెత ఉండనే ఉంది కాదా!

అందుకే శ్రీదేవి ఇకపై కాస్త సంపాదించాలి అనే ఆలోచనలో పడినట్టుగా ఉంది. సంపాదించాలి అంటే వాణిజ్య ప్రకటన ఎందుకు ఇప్పుడు వచ్చి హీరోయిన్ గా నటిస్తానంటే ఎంతో మంది నిర్మాతలు ఆమె కోసం క్యూ కడతారు కదా! అనుకుంటారు..కానీ శ్రీదేవి కి అలా చేయడం ఇష్టం లేదట. అందుకే చిన్న చిన్న యాడ్ లలో నటించి చేతినిండా సంపాదించాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఆమె 'వానిష్" అనే బట్టలుతికే సౌడర్ కు సంబంధించిన యాడ్ లో నటించింది ఈ యాడ్ లో బట్టలుతుకుతూ కనిపించి అందరినీ ఆ పౌడర్ వాడమని కోరుతుంది. ఈ యాడ్ త్వరలో బుల్లి తెరపై రాబోతోంది అయితే ఈ యాడ్ చేయడానికి దేవి గారు బాగానే పుచ్చుకున్నారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu