»   »  తెలుగులో ధనుష్ దడదడలు?

తెలుగులో ధనుష్ దడదడలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Danush
రజనీకాంత్ అల్లుడు ధనుష్ మళ్లీ తెలుగులోకి రావటానికి ప్లాన్ చేస్తున్నాడట. అదీ తన అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనట. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 'ధూల్ పేట' అనే సినిమా వచ్చింది. టెక్నికల్ గా అద్భుతంగా ఉన్నా కథాపరంగా బాగలేకపోవడంతో దారుణమైన ఫ్లాప్ గా మిగిలి పోయింది. తరువాత ఇండియన్ బ్రూస్ లీ అంటూ బిరుదు ఇచ్చి మరీ ధనుష్ పాత తమిళ సినిమాలను వరసగా డబ్బింగ్ చేసి తెలుగు వారికి వాతలు పెట్టారు. అవి థియోటర్లలలో దిగినంత సేపు నిలబడ లేదు. ఫలితంగా అతనికున్న కొద్దిపాటి క్రేజ్ కూడా మూసీ నదిలో కొట్టుకుపోయింది. దాంతో ధనుష్ అంటే ఫినిష్ అనే టాక్ వచ్చింది. కాని సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'సెవన్ బై జి బృందావన్ కాలని', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో తన అన్న కాంబినేషన్ లో మళ్లీ మరోసారి తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడట.మరి ఈ సారి ఈ కాంబినేషన్ లో 'కాదల్ కొండన్' (తెలుగు రీమేక్ నేను )లాంటి సైకో సినిమా వస్తుందో, ధూల్ పేట లాంటి యాక్షన్ ఫిల్మ్ అందిస్తారో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X