»   » ఆ దర్శకులను ఏకాంతంగా కలుసుకొంటోన్న త్రిష...

ఆ దర్శకులను ఏకాంతంగా కలుసుకొంటోన్న త్రిష...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో తనకు తీవ్ర స్థాయిలో భంగపాటు జరిగినందువల్లే మళ్లీ దక్షిణాది చిత్రాలు అంగీకరిస్తోందని..'కట్టా మీటా" హిట్ అయ్యింటే ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూసి ఉండేది కాదంటూ తనపై పదేపదే వార్తా కథనాలు వెలువరిస్తుండడం పట్ల అందాల భామ త్రిష ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సెక్స్ స్కాండల్స్ లో తనను ఇరికించినప్పుడు, తనమీద రకరకాల వదంతులు సృష్టించినప్పుడు కూడా త్రిష లైట్ గా తీసుకుంది. అయితే బాలీవుడ్ లో ఛీకొట్టినందునే మళ్లీ కోలీవుడ్ లో, టాలీవుడ్ లో సినిమాలు అంగీకరిస్తోదంటూ ప్రచారం జరుగుతుండడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

హిందీలోకి ప్రవేశిస్తూ తను నటించిన 'ఖట్టామీటా" అట్టర్ ప్లాప్ అయ్యిందని జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని త్రిష బుకాయిస్తోంది. ఈ విషయం పై త్రిష మాట్లాడుతూ, 'మొట్ట మొదట నేను బాలీవుడ్ వైపు నా దారిని మర్చుకున్నాని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా ప్రాముఖ్యత అంతా సౌత్ సినిమా పైనే. ఒక వేళ నేను బాలీవుడ్ లోనే స్థిరపడి పోవాలనుకుంటే, నేను కూడా అసిన్ లాగా మొత్తం సర్దుకొని ముంబైకి వెళ్ళిపోయేదానిని. 'ఖట్ట మీటా' నా 40 వ సినిమా. అంతే కాదు, ట్రేడ్ పేపర్స్ ప్రకారం, ఈ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. ఈ రోజు కూడా నేను నా రోల్, స్క్రిప్ట్, ఫిలిం మేకర్స్ ని బట్టే బాలీవుడ్ లో సినిమాని ఎంచుకుంటాను అని చెప్పింది. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం రావడమే కాకుండా, నిర్మాతకు ఎంతో కొంత లాభం సైతం వచ్చిందని ప్లేట్ ఫిరాయిస్తోంది. అంతే కాదు మరొక హిందీ చిత్రంలో నటించే అవకాశాన్ని స్వంతం చేసుకుని అందరి నోళ్లూ మూయించాలన్న ఆలోచనలో ఉన్న త్రిష..కొందరు హిందీ దర్శకులను ఏకాంతంగా కలుస్తోందని కూడా తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu