»   » త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం హీరో ఖరారు...డిటేల్స్

త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం హీరో ఖరారు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తర్వాత త్రివిక్రమ్ ఏం చిత్రం చేయబోతున్నారనే విషయమై అంతటా అంచనాలు చర్చలు మొదలయ్యాయి. పవన్ తో చిత్రం అని, మహేష్ తో సినిమా అని ఇలా రోజుకో వార్త వస్తోంది. ఆ మధ్యన సమంతతో ..హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ ఓ చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. ఆ హీరో ఎవరూ అంటే నితిన్ . నితిన్ హీరోగా త్రివిక్రమ్ కంట్రోలు బడ్జెట్ లో ఓ సినిమా చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంతకు ముందు...

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

Trivikram next with Nithin ?

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Director Trivikram is in full swing with back to back hits. The director was supposed to do a film with Mahesh babu but it has been delayed due to mahesh’s date’s issue. During this time the director is willing to do a film with small film.Nagachaitanya and nithin was in race to play lead role. But According to the tinsel town, Trivikram is planning to rope hero Nithin in lead role. However an official announcement will be made very soon.
Please Wait while comments are loading...