»   » కిర్రెక్కించే ఉదయ భాను సీన్లకు కత్తెర?

కిర్రెక్కించే ఉదయ భాను సీన్లకు కత్తెర?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టెలివిజన్ ప్రేక్షకులకు ఉదయ భాను అంటే ఎనలేని క్రేజ్. ఇప్పుడది మారిపోయిందట. తీవ్రమైన పోటీ వల్ల ఆమె పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. సినిమాల్లో నటించడానికి ఆమె తీవ్రంగానే ప్రయత్నించారు గానీ సరైన పాత్రలు దొరకలేదు. ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ అదృష్టం కలిసి రాలేదు.

చాలా గ్యాప్ తర్వాత ఆమె ఇటీవల మధుమతి చిత్రంలో నటించారు. ఈ సినిమా కోసం ఉదయ భాను చాలా కష్టపడ్డారని చెబుతారు. ఆమె కఠిన శ్రమను, నటనా కుశలతను తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించే రోజులు వచ్చాయని అనుకుంటున్నారు.

ఆ సినిమాలోని ఉదయ భాను పోషించిన పాత్రపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొని ఉంది. అయితే, ఫిల్మ్ యూనిట్ ఆమెపై నిరాశకు గురైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. షూటింగ్ సందర్భంగా ఆమె చేసిన తంత్రాలపై కోపంగా ఉందట. ప్రమోషనల్ యాక్టివిటీకికి కూడా సహకరించడం లేదని అంటున్నారు.

దాంతో ఆమెపై గుర్రుగా ఉన్న సినిమా యూనిట్ ఆమె నటించిన కీలకమైన సీన్లకు కత్తెర వేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, అది ఎంత వరకు నిజమనేది తెలియదు. సినిమా విడుదలై ఉదయ భాను గొంతెత్తి ఏమైనా తెలుస్తుందేమో..

English summary
After a long gap, Udaya Bhanu has recently acted in a film titled Madhumati. It is said that Udaya Bhanu worked really hard for the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu