»   » వెంకటేష్-మారుతి చిత్రం టైటిల్ మారింది

వెంకటేష్-మారుతి చిత్రం టైటిల్ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వెంకటేష్, మారుతి కాంబినేషన్ లో ఆ మధ్యన ఓ ప్రాజెక్టు చివరిదాకా వెళ్లి కథ కాపీ వివాదంతో కంచికి వెళ్లింది. అయితే మారుతి తాజాగా భలే భలే మొగాడివోయ్ అంటూ సూపర్ హిట్ చిత్రం ఇచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్టు ఎక్కటానికి రంగం సిద్దమైంది. సితార క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'రాధ' అనే సినిమా ఎనౌన్స్ అయి ఆగిపోయింది. ఆ తరువాత మరోసారి వెంకీని తన కథతో మెప్పించిన మారుతి డిసెంబర్ చివరివారంలో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వెంకీ జోడిగా నయనతార నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ గా... 'రాధాకృష్ణ ' అని పెట్టాడని తెలుస్తోంది.

Venkatesh- Maruthi film titled

'గోపాల గోపాల' సినిమా తరువాత తన తదుపరి ప్రాజెక్టును ఫైనల్ చేయటానికి చాలా టైం తీసుకున్నాడు వెంకటేష్. సీనియర్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు చాలామంది కథలు విన్న విక్టరీ హీరో ఫైనల్ గా ఈ యువ దర్శకుడికు ఓకే చెప్పాడు.

కొద్ది రోజులుగా మళయాల సినిమా 'భాస్కర్ ది రాస్కెల్' రీమేక్‌లో నటిస్తాడంటూ వార్తలు వినిపించటంతో మారుతి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం , స్ట్రయిట్ సినిమానా లేక రీమేక్ అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

English summary
Director Maruthi is all set to wield megaphone for Venkatesh's next project titled as ‘Radha Krishna’. Sitara Creations will be producing the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu