»   » వెంకటేష్ ఇల్లు మారాడు: రామానాయుడు ఫ్యామిలీపై రూమర్స్!

వెంకటేష్ ఇల్లు మారాడు: రామానాయుడు ఫ్యామిలీపై రూమర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత డి. రామానాయుడు మరణం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక రూమర్లకు కారణం అవుతోంది. ముఖ్యంగా రామానాయుడు ఉన్నంత వరకు కలిసి కట్టుగా ఒకే దగ్గర ఉన్న కుటుంబం... ఆయన మరణం తర్వాత వేరు కాపురాలు పెట్టడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

రామానాయుడు ఆ మధ్య కాలం చేసిన కొన్ని రోజుల తర్వాత రకరకాల పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. రామానాయుడి మరణం తర్వాత వెంకటేష్, సురేష్ బాబు ఆస్తుల పంపకాల గురించి ఆలోచన చేసారని, ఎవరి వాటా ఎంత అనే విషయాలు లెక్కలు వేస్తున్నారని, త్వరలోనే ఇద్దరూ తండ్రి సంపాదించిన ఆస్తులు పంచుకునే అవకాశం ఉందని అప్పట్లో పుకార్లు వినిపించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటేష్ ఇల్లు మారడం చర్చనీయాంశం అయింది. వెంకటేష్ ఈ మధ్యే ఫిల్మ్ నగర్లో ఇంతకాలం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మణికొండ ప్రాంతంలో కొత్తగా తన అభిరుచికి తగిన విధంగా సకల సౌకర్యాలతో నిర్మించుకున్న ఇంట్లోకి మారినట్లు సమాచారం. నాలుగు ఎకరాల స్థలంలో సకల సౌకర్యాలతో ఈ ఇల్లు ఉంది.

ఫిల్మ్ నగర్లో ఇంతకాలం తాను ఉన్న ఇంటికి కమర్షియల్ రెంటుకు ఇచ్చేసినట్లు సమాచారం. ఇంటితో పాటు పక్కన ఉండే ఖాళీ స్థలాన్ని కూడా అద్దెకు ఇచ్చాడట. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ నడిపిస్తున్నట్లు సమాచారం.

అయితే వెంకీ ఇల్లు మారడాన్ని కొందరు తప్పుడు ప్రచారం చేయడం, రామానాయుడు ఫ్యామిలీలో విబేధాలు వచ్చినట్లు ప్రచారం జరుగడంపై ఆయన సన్నిహితులు ఖండిస్తున్నారు. అలాంటిదేమీ లేదని, అన్నమ్ములు సురేష్ బాబు, వెంకటేష్ బంధం బలంగానే ఉందని అంటున్నారు వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ గురించి సురేష్ బాబు వివరణ ఇచ్చారు, తాము ఆస్తులు పంచుకోలేదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు. అందుకు సంబంధించిన వివరాలు మీ కోసం మరోసారి.

ఆస్తులు పంచలేదు

ఆస్తులు పంచలేదు

తండ్రి తమకు ఇచ్చిన ఆస్తుల్ని ఇంకా సమష్టిగానే చూసుకుంటున్నామని, పంపకాలు జరుగలేదని, అలాంటి ఆలోచన మేమెప్పుడూ చేయలదని నిర్మాత సురేష్ బాబు తెలిపారు.

కలిసికట్టుగానే..

కలిసికట్టుగానే..

నేనూ వెంకటేష్ ఎప్పడూ కలిసి కట్టుగానే ఉంటాం. చిన్నప్పటి నుంచీ మా మధ్య ఒకరకమైన అవగాహన కుదిరింది. అన్నయ్య కాబట్టి... నేను పెద్ద - వాడు చిన్న అనే భావన మా మధ్య ఎప్పుడూ ఉండదు అన్నారు సురేష్ బాబు.

పేరు పెట్టే పిలుచుకుంటాం

పేరు పెట్టే పిలుచుకుంటాం

మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. ఒకరి మాటకు ఒకరం విలువ ఇచ్చుకుంటాం. ఇప్పటికీ పేర్లు పెట్టే పిలుచుకుంటాం. ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకుంటామని సురేస్ బాబు తెలిపారు.

అలా జరుగదు

అలా జరుగదు

వాడికి నచ్చని పని నేను చేయడం, నాకు నచ్చనిది వాడూ చేయడం లాంటి ఎప్పుడూ జరుగలేదు జరుగదు కూడా.. అని సురేష్ బాబు తెలిపారు.

ఆస్తులు వాటావేస్తామన్నారు..

ఆస్తులు వాటావేస్తామన్నారు..

నా పెళ్లయిన కొత్తలోనే ఆస్తుల్ని వాటాలు వేసేస్తామని నాన్నగారు అన్నారు. కానీ మేమిద్దరం వద్దన్నాం. కలిసే ఉంటామని చెప్పాం. అలానే ఉంటున్నామని సురేష్ బాబు తెలిపారు.

సొంత, ఉమ్మడి..

సొంత, ఉమ్మడి..

వాడికో సొంత ఇల్లు ఉంది. నాకూ ఓ సొంత ఇల్లు ఉంది. ఇక మిగతాదంతా మా ఇద్దరి ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయని సురేష్ బాబు తెలిపారు.

కష్టపడింది చాలు విశ్రాంతి తీసుకో అంటాడు..

కష్టపడింది చాలు విశ్రాంతి తీసుకో అంటాడు..

వెంకటేష్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇన్నాళ్లూ కష్టపడింది చాలు ఇకనైనా విశ్రాంతి తీసుకుందాం పని తగ్గించుకో అని సలహా ఇస్తుంటాడని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

English summary
Telugu cinema hero Victory Venkatesh stepped into his new home in Dollar hills area in Manikonda. It is believed that Venkatesh's newly constructed home is spread across 4 acres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu