»   » త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి

త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ చిత్రం కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ నుంచి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖలేజా విడుదలై భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక నిర్మాత దానయ్య ఈ చిత్రానికి ముందు అల్లు అర్జున్ తో చేసిన వరుడు చిత్రం నిర్మించారు. మరో ప్రక్క వెంకటేష్..బాడీగార్డ్ రీమేక్ కు కూడా కమిటయ్యారని తెలుస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu