twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్ల ఢీ సీక్వెల్.. బ్రహ్మానందంను కాదని మరో స్టార్ కమెడియన్.. శ్రీ హరి పాత్రలో?

    |

    2007లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఢీ. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆ సినిమాకు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా సాధించిన విజయం ప్రతి ఒక్కరి కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఆల్ టైమ్ బెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో టాప్ ఫిల్మ్ గా క్రేజ్ అందుకుంది.

    అందరి జీవితాలని మార్చేసిన సినిమా..

    అందరి జీవితాలని మార్చేసిన సినిమా..

    ఢీ సినిమా ఇప్పటికి కూడా టీవీలల్లో వచ్చినా కూడా మంచి టీఆర్పీని అందుకుంటుంది. మంచు విష్ణు కెరీర్ మొత్తంలో అదే ఎక్కువ విజయాన్ని అందుకున్న సినిమా. అలాగే జెనీలియాకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందించింది. ఇక మిగతా సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన వారి కెరీర్ కి కూడా ఢీ సినిమా చాలానే ఉపయోగపడింది.

    ఆ రెండు పాత్రలే హైలెట్..

    ఆ రెండు పాత్రలే హైలెట్..

    అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం ఆ సినిమాకు దర్శకుడు శ్రీను వైట్ల సీక్వెల్ ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ కావడానికి కారణం ఎక్కువగా కమెడియన్స్ ఉపయోగపడ్డారు. అందులో బ్రహ్మానందం ఒకరు. ఆ తరువాత శ్రీహరి చేసిన పాత్ర కూడా సినిమాలో మరో హైలెట్ క్యారెక్టర్.

    శ్రీహరి.. బ్రహ్మి పాత్రల కోసం..

    శ్రీహరి.. బ్రహ్మి పాత్రల కోసం..

    అయితే ప్రస్తుతం ఆ పాత్రల విషయంలో చిత్ర యూనిట్ ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీహరి లేరు కాబట్టి ఆయన పాత్రకు న్యాయం చేయాల్సిన వారు ఎవరు ఉన్నారు అనేది పెద్ద డౌట్. ఆ పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారే అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి గాసిప్ లేదు. అయితే బ్రహ్మానందం చేసిన చారి పాత్రలో మాత్రం కొత్త కమెడియన్ కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    #DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
    చారి పాత్రలో వెన్నెల కిషోర్

    చారి పాత్రలో వెన్నెల కిషోర్

    ప్రస్తుతం బ్రహ్మి జోరు తగ్గిందని ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో శ్రీను వైట్ల ఆ పాత్ర విషయంలో కొన్ని మార్పులు చేసి వెన్నెల కిషోర్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచిన చారి పాత్రలో వెన్నెల కిషోర్ ని ఏ విధంగా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Manchu Vishnu Emotional On 13 Years for DHEE. 13yrs of Dhee. 13th April 2007 is the day I experienced the term ‘Tears of Joy’. If not for my dad themohanbabu, this film would have never released. First thanks to him. What a movie! Cult action comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X