»   » మళ్లీ వార్తల్లోకి దాసరి :పవన్ తో ప్రాజెక్టు ఏమైందో కానీ... జయలలితకే జై కొట్టి ముందుకెళ్తున్నారు

మళ్లీ వార్తల్లోకి దాసరి :పవన్ తో ప్రాజెక్టు ఏమైందో కానీ... జయలలితకే జై కొట్టి ముందుకెళ్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు కొన్నేళ్లుగా డైరెక్షన్ కు దూరంగానే ఉంటున్నారు. సినిమా రంగానికి.. ముఖ్యంగా చిన్న సినిమాలకు అండగా ఉండేందుకు తన గొంతను ఎలుగెత్తి వినిపించే దాసరి.. మళ్లీ దర్శకుడి పగ్గాలు చేపట్టబోతున్నారట. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు రెడీ అవుతున్నారాయన. పవన్ తో సినిమా నిర్మిస్తారనుకుంటే దాని విషయం ఎలాగో తేలటం లేదు..ఈ లోగా ఈ చిత్రం పూర్తి చేయాలని ఆయన చూస్తున్నారని సమాచారం.

దాసరి 'అమ్మ' టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేయించాడు. ఇక ప్రస్తుతం స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా వేసవిలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్రంలో అమ్మ పాత్రను ఎవరు పోషిస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

నాకు తెలిసిన జయలలిత తల్లి ఆలన తర్వాత భర్త పాలనతో బిడ్డకు అమ్మ కావాలనుకుంది. నిజజీవితంలో అది జరగలేదు. ఒక బిడ్డకు అమ్మ కాలేకపోయినా పదికోట్ల తమిళులకు అమ్మగా జీవితాన్ని ముగించింది అంటూ దాసరి చెప్తున్నారు.

పద్మతోనే సన్నిహితంగా..

పద్మతోనే సన్నిహితంగా..

దాసరి మాట్లాడుతూ... ఆ రోజుల్లో ఆమె డేట్స్‌ కోసం ఎదురుచూడని వారు లేరు. వ్యక్తిగతంగా నాతో, పద్మతో చాలా స్నేహపూర్వకంగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే ఎక్కువగా పద్మతోనే సన్నిహితంగా ఉండేది. నేనంటే చాలా గౌరవంగా ఉండేది.

ఓ రోజు అర్దరాత్రి..

ఓ రోజు అర్దరాత్రి..

1977లో ‘కన్యాకుమారి' సినిమా కథ మొదట జయకే చెప్పా. చాలా ఇనస్పైర్‌ అయింది. రెండేళ్ల వరుకు తనకి డేట్స్‌ లేనప్పటికీ సర్దుబాటు చేసింది. ఉన్నట్టుండి ఓరోజు అర్ధరాత్రి ఫోన వచ్చింది. అది ఎమ్జీఆర్‌గారి ఫోన్. ‘బ్రదర్‌ నిద్రపోతున్నారా'? అనడిగి ‘నేను ఎమ్జీఆర్‌ని' అని చెప్పారు. ‘ఈ టైమ్‌లో మీరు ఫోన్ చేస్తారని ఊహించలేదు' అనగానే ‘అందుకే పేరు చెప్పాను. జయలలిత డేట్స్‌ గురించి కాల్‌ చేశాను(కశ్మీర్‌లో ఆయన సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయమది). మీ షెడ్యూల్‌ నుంచి ‘జయలలిత డేట్స్‌ 20 రోజులు నా కోసం అడ్జస్ట్‌ చెయ్యాలి' అని అడిగారు.

మరో రెండేళ్లువరకూ..

మరో రెండేళ్లువరకూ..

ఎమ్టీజీర్ అడిగితే ఎవరు కాదంటారు చెప్పండి. ‘సరే సార్‌' అన్నా. నాకు అప్పుడున్న బిజీలో కన్యాకుమారి నిర్మాతలకు ఇచ్చిన డేట్స్‌కి సినిమా చెయ్యకపోతే మరో రెండేళ్ల వరకు వాళ్లకు అవకాశం ఉండదు. అయినా సరే ఎంజీఆర్‌ అడిగారు కనుక జయలలిత డేట్స్‌ ఇచ్చేశాను.

కన్యాకుమారి సినిమా తీసా

కన్యాకుమారి సినిమా తీసా

‘తర్వాత ఆమెని నాకో సినిమా చేసిపెట్టమనండి చాలు' అనడిగా. ‘ఎప్పుడైనా సరే నాది బాధ్యత' అని ఎమ్జీఆర్‌ మాటిచ్చారు. అప్పుడు శ్రీవిద్యను పెట్టి ‘కన్యాకుమారి' సినిమా తీశా. కశ్మీర్‌ నుంచి తిరగిరాగానే జయలలిత తనకిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేసింది. ఆమెకు ఫోన్ చేసి ‘ఆ డబ్బులు నీదగ్గరే ఉంచుకోమ్మా. ‘తర్వాతి సినిమాకు ఇచ్చాననుకో' అన్నా. ఈ సంఘటన తర్వాత మా కుటుంబాల మధ్య స్నేహం మరింత పెరిగింది.

జయే వండి పెట్టేది

జయే వండి పెట్టేది

జయకు సినిమా వాళ్లంటే మహా ప్రాణం. మామూలుగా ఆమె నివశించే ‘పోయెస్‌ గార్డెన్'లోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఉండదు. ‘గోరింటాకు', ‘బహుదూరపు బాటసారి', ‘అభిమన్యుడు', ‘మెహందీ' చిత్రాల షూటింగ్‌ జయ ఇంట్లో చేశా. అక్కడ ఉన్నని రోజులు బయటి నుంచి భోజనం తీసుకొచ్చే పరిస్థితే ఉండేది కాదు. తన ఇంట్లోనే వండించి పెట్టేది. సినిమా వాళ్లంటే ఆమె మహా ఇష్టం అని ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది.

కళ్లల్లో నీళ్లు తిరిగుతాయి

కళ్లల్లో నీళ్లు తిరిగుతాయి

ఎమ్జీఆర్‌ పేర స్టూడియో కట్టించింది. ప్రారంభోత్సవానికి నన్ను అతిథిగా పిలిచింది. వేదిక మీద ఐదుగురే ఉన్నాం. బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ఇండియా అని శరవణన్ గారి పేరు, బెస్ట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండియా అని నాపేరు ప్రకటించింది. ఒక్కసారిగా నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘అన్నయ్య' అని పిలిచే నా చెల్లెలు జయలలిత నాకు ఇచ్చిన గౌరవం అది. రవీంద్రభారతిలో లక్ష్మీపార్వతిగారి పుస్తకావిష్కరణలో ఎన్టీఆర్‌, జయలలిత అతిథులు. ఈ కార్యక్రమానికి నేను అధ్యక్షుణ్ణి. అంతకన్నా గౌరవం ఏముంటుంది చెప్పండి.

అన్ని మరిచిపోయి

అన్ని మరిచిపోయి

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా వాళ్లు కనిపిస్తే అన్ని మరచిపోయి ఆనందంగా మాట్లాడేది. భవిష్యత్తులో ప్రతి ముఖ్యమంత్రి ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి. ఆదర్శంగా తీసుకోవాలి. వాగ్దానాలతో పేదల కడుపు నిండదు.. చేతలతోనే నిండుతుందని ఆమె రుజువు చేసింది. జనం కోసం పుట్టింది.. జనం కోసం వెళ్లిపోయింది.

చెక్కు చెదరలేదు

చెక్కు చెదరలేదు

ఎంజీఆర్‌గారు అమెరికాలోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన లేని లోటు తెలియకుండా ఆమె ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చింది. అయినా ముఖ్యమంత్రి కాలేకపోయింది. అవమానాల పాలైంది. చివరికి తన గురువైన ఎంజీఆర్‌ అంతిమయాత్రలో ఆయన శవపేటిక ఉంచిన వాహనంలో కూడా స్థానం దక్కలేదు. అయినా ఆ అవమానానికి చెక్కు చెదరలేదు. పట్టు విడువలేదు.

కంగారుపడలేదు

కంగారుపడలేదు

తర్వాత ప్రతిపక్ష నాయకురాలై నిండు సభలో దుశ్శాసన పర్వం చవిచూసింది. కంగు తినలేదు. కంగారు పడలేదు. రాటు తేలింది.. పోటీ పడింది.. ముఖ్యమంత్రి అయింది. అప్పటినుంచి రోజూ ప్రజల్లోకి వెళ్లి, సమావేశాలు పెట్టి వాగ్దానాలు చెయ్యలేదు.

క్యాంటీన్లు రూపకల్పన

క్యాంటీన్లు రూపకల్పన

సచివాలయం మీద పట్టు విడవకుండా రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ పగ్గాలన్నీ తన చేతిలో పెట్టుకుని పేద ప్రజలకు కావలసిన కూడు, గుడ్డ, గూడు రూపకల్పన చేసింది. అమ్మ పేరుతో క్యాంటీన్లు రూపకల్పన చేసి అన్నం పెట్టింది. ఫార్మసీలు పెట్టి వైద్యం అందించింది. ఇంకెన్నో పథకాలతో పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని కోట్లాది మందికి ‘అమ్మ' అయింది.

ఆటుపోట్లు తప్పలేదు

ఆటుపోట్లు తప్పలేదు

రాజకీయ చరిత్రలో జయలలితలా ప్రయాణం చేసిన మరో రాజకీయ మహిళ కనిపించదు. ఆమె రాజకీయ ప్రవేశం సులభంగానే జరిగింది. అక్కడ నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు అడుగడుగునా ఆటుపోట్లు తప్పలేదు. సంతోషకరమైన జీవితం లేదు.

English summary
Dasari is currently busy penning the script of the film titled ‘Amma’ which happened to be the biopic of Tamil Nadu Chief Minister Jayalalithaa who passed away recently. The movie will be shot in Telugu, Tamil and Hindi languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu