»   » హీరోగా ఎమ్.ఎస్.రాజు కుమారుడు..డైరక్టర్ ఎవరంటే...

హీరోగా ఎమ్.ఎస్.రాజు కుమారుడు..డైరక్టర్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ ని హీరోగా త్వరలో పరిచయం కానున్నాడు. డైరక్టర్ గా వియన్ ఆదిత్యని ఎంపిక చేసినట్లు సమాచారం. మే పదవ తేదీన ఈ చిత్రం ప్రారంభం కానుంది. మిర్చి అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టనున్నారని సమాచారం. ఇక ఇంతకు ముందు ఎమ్.ఎస్.రాజు, వియన్ ఆదిత్య కాంబినేషన్లో మనసంతా నువ్వే, ఆట చిత్రాలు వచ్చాయి. అలాగే ఈ కొత్త చిత్రం మ్యుజికల్ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు తేజ దర్శకత్వంలో చిత్రం ప్రారంభించటానికి పూజ కూడా చేసిన ఎమ్.ఎస్.రాజు పలు కారణాలతో దానిని విరమించుకున్నాడు. అలాగే ఈ కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో పాటలు రికార్డింగ్ కూడా త్వరలో జరగనుంది. హీరోయిన్ గా ముంబై అమ్మాయిని ఎంపిక చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu