»   » 5 లక్షలతో ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరిన రామ్ గోపాల్ వర్మ..!

5 లక్షలతో ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరిన రామ్ గోపాల్ వర్మ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా, తీయకపోయినా కూడా సంచలనమే. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను భయపెట్టడం అంటే ఆయనకు ఓ సరదా. ఈ సారి మాత్రం ప్రేక్షకులను మోతాదుకు మించి భయబ్రాంతులకు గురిచేయానుకుంటున్నారు. ఇప్పటికే హరర్ జనర్ లో 'భూత్", 'డర్నీ మనా హై", 'డర్నా జరూరీ హై", 'ఫూంక్" చిత్రాలను ఆయన నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ తెలుగులో 'రక్ష" తర్వాత మరో హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం 'ఫూంక్" హిందీ సినిమాకి సీక్వెల్ గా 'ఫూంక్-2" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆవహాం" పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే థియేటర్ లో ఒంటరిగా కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తే 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని వర్మ ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూసే వ్యక్తి హార్ట్ బీట్ తెలుసుకోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రఫీ మిషన్ అటాచ్ చేస్తారట. అలాగే కెమెరాతో అతని రియాక్షన్స్ కూడా షూట్ చేస్తారని సమిచారం.

ఈ మొత్తం ప్రక్కియ తిలకించేందుకు థియేటర్ బయట స్ర్కీన్ ఏర్పాటు చేస్తారట. సంబందిత వ్యక్తులతో పాటు మీడియా సమక్షంలో ఇదంతా జరుగుతుందని వర్మ తెలియజేశారు. మరి దీనిని ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమాని చూడటానికి ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu