twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త ట్విస్ట్: ఈ సారి వర్మ వెండి తెరపై కనపడి మరీ..

    By Srikanya
    |

    హైదరాబాద్ : డైరక్టర్ గా మాత్రమే కాకుండా వాయిస్ ఓవర్ చెప్పటం, పాటలు పాడటం వంటివి చేసిన వర్మ ఇప్పుడు డైరక్ట్ గా వెండి తెరపై కనపడటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతోంది. ఆయన తెరపై కనపడి తన చిత్రానికి సంభందించిన విషయాన్ని నేరేట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..త్వరలో వర్మ దర్శకత్వంలో రూపొందనున్న స్పాట్. ఈ చిత్రం కథని నేరేట్ చేయటానికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.

    'స్పాట్‌' చిత్రం పూర్తి డిటేల్స్ లోకి వెళితే...

    వైవిధ్య చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి 'స్పాట్‌' అనే పేరు పెట్టారు. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమా గురించి తెలియజేయడానికి ఆయన ఓ ఆడియో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో 'స్పాట్‌' పుట్టుపుర్వోత్తరాలు తెలిపారు.

    What's There In RGV's 'SPOT'?

    వర్మ మాటల్లోనే ''స్పాట్‌ అనేది వాడుక భాషలో ఓ మనిషిని చంపడానికి ఫ్యాక్షనిస్టులు పెట్టుకున్న ముద్దు పేరు. ఈ పదం ఎంత సింపుల్‌గా ఉంటుందో... దాని అసలు స్వరూపం చూస్తే అంతగా ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'రక్తచరిత్ర' తీస్తున్నప్పుడు నేను కలిసిన మనుసుల్ని, విన్న విషయాలను నా జీవితంలో మరచిపోలేను. ఆ విషయాలకు 'రక్తచరిత్ర' రెండు భాగాల్లో వంద శాతం న్యాయం చేయలేకపోయాను. దానికి ఒక కారణం రెండు గంటల సినిమాల్లో మహాభారతం లాంటి రక్తచరిత్ర కథను ఎంతని చూపించగలం?

    ఇంకో ముఖ్య కారణం అప్పుడున్న పరిస్థితుల్లో నాపై పేర్లు చెప్పడానికి వీల్లేని అనేక మంది నుంచి ఒత్తిళ్లు రావడం. 'రక్తచరిత్ర' వెనుక ఉన్న అసలు చరిత్రకు న్యాయం చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. మరేం చేద్దామని ఆలోచించిన తర్వాత ఓబుల్‌ రెడ్డి స్పాట్‌ను ఓ అధ్యయనంలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. దీన్నే ఒక సినిమాగా తీయాలని నిర్ణయించాను.

    'రక్తచరిత్ర 1' లో 10 నిమిషాలపాటు ఉన్న ఓబుల్‌రెడ్డి హత్య సన్నివేశాన్ని పూర్తి సినిమాగా తీయాలనుకోవడానికి కారణం ఓబుల్‌ రెడ్డికి స్పాట్‌ పెట్టడానికి వెనుక ఉన్న అసలు కారణాల్ని, వ్యక్తుల్ని... స్పాట్‌ పెట్టాక వచ్చిన పరిస్థితుల్ని బయటపెట్టాలనుకోవడమే. హైదరాబాద్‌ నగరాన్ని కంపింపజేసిన ఆ స్పాట్‌ 1996లో హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

    రాయలసీమ ఫ్యాక్షన్‌ కోరలు మొదటిసారిగా కాటు వేసింది ఈ స్పాట్‌తోనే. దీని వెనుక జరిగిన అసలు విషయాల్ని ఆ స్పాట్‌ పెట్టిన వాళ్ల నుంచి ఈ మధ్య తెలుసుకున్నాను. స్పాట్‌ పెట్టడానికి ముందు, తర్వాత ఎంతగా చర్చలు జరుగుతాయో తెలుసుకున్నాక షాక్‌ అయ్యాను. ఆ పరిణామాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతోనే ఈ సినిమా చేస్తున్నాను'' అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ.

    English summary
    RGV will be seen in few scenes because in Spot movie is a need for him to be part of the narration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X