Just In
- 4 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 31 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 48 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 1 hr ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీఎం పీఏగా రవితేజ.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా?
మాస్ మహారాజకు కాలం కలిసి రావడం లేదు. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు. విలక్షణ దర్శకుడిగా పేరున్న వీఐ ఆనంద్‌తో చేసిన డిస్కోరాజా సైతం ఓ సాధారణ రివేంజ్ డ్రామా మిగిలిపోయింది. అయితే గత చిత్రాలతో పోలిస్తే డిస్కోరాజా కాస్త నయమనిపించేలానే ఉంది. అయితే ఈ సినిమా ఫలితం గురించి అంతగా పట్టించుకోకుండా.. తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాడు రవితేజ.

ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో..
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ముచ్చటగా మూడో సారి క్రాక్ అంటూ వచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

రమేష్ వర్మతో..
రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో గతంలో వీర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో వీర ఒకటి. అలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ వర్మకు రవితేజ మరో చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రీసేంట్‌గా రీమేక్‌తో హిట్..
తమిళ చిత్రం రాక్షసన్‌ను తెలుగులో రాక్షుసుడుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రీమేక్ అయినప్పటికీ స్టైలీష్‌గా తెరకెక్కించిన రమేష్ వర్మకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా హిట్ అయిన కారణంగానే రమేష్ వర్మకు రవితేజ అవకాశమిచ్చినట్టు టాక్.

సీఎం పీఏగా..
ఈ చిత్రం ఒక సీఎం పీఎ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు.. అతడు అవినీతికి పాల్పడితే ఎలా ఉంటుంది.. అతడు మంచిగా మారిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాలను చూపిస్తూ సాగుతుందట. స్టోరీ లైన్ బాగుందని.. సీఎం పీఏ పాత్ర అవ్వడంతో రవితేజ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.