స్టార్ హీరో కుమారుడితో షూట్ సమయంలో ప్రేమ.. సహజీవనం.. పెళ్ళికి సిద్దమైన మరో హీరోయిన్?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. తమ తమ సహ నటి నటులతో ప్రేమలో పడటం కొన్నాళ్ల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, అన్నీ బాగున్నాయి అనుకుంటే పెళ్లి చేసుకోవడం, లేకపోతే బ్రేకప్ చెప్పుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో కుమారుడు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హిట్ అందుకోవడానికి కష్టపడుతున్న అతను తనతో పాటు హీరోయిన్ గా నటించిన ఒక భామతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలేక్కేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

స్టార్ హీరో కుమారుడు
ఆ స్టార్ హీరో కుమారుడు మరెవరో కాదు ఒకప్పటి తమిళ స్టార్ కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్. ఇక ఆ అమ్మాయికి కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె మరెవరో కాదు మంజిమా మోహన్. మంజిమ మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ మరియు డ్యాన్సర్ కళా మండలం గిరిజల ముద్దుల కూతురు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో
మలయాళ, తమిళ చిత్రాలు చేస్తున్న మంజి మోహన్ తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా కూడా చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంత హిట్ అయితే అవలేదు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. కానీ ఆ తరువాత మంజిమా ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రేమ చిగురించి
అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు గౌతమ్ కార్తీక్ మంజిమా ఇద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ జంట కోలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి 2019లో దేవరత్తమ్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అది పెళ్లి వరకు తీసుకువెళ్లాలి అనేది వారి అభిలాష గా తెలుస్తోంది.

త్వరలోనే పెళ్లి
ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అని, ఇరు కుటుంబాలను ఒప్పించి త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ వచ్చే కొద్ది నెలల్లో అధికారికంగా ప్రకటిస్తారు అని ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరి 14 సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఏప్రిల్‌లో?
కానీ అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరు వివాహమాడనున్నారని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఫిబ్రవరి 14 వచ్చేసింది కాబట్టి అధికారిక ప్రకటన ఏదైనా వస్తే మరో సినీ జంట ప్రేమ పెళ్లికి సిద్ధమైనట్లు అని ఖరారు అవుతుంది.


Click it and Unblock the Notifications











