అప్పుడే మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశాడు.. జోరు మీదున్న ఆది సాయి కుమార్
డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా ప్రేమ కావాలి చిత్రంతో వెండితెరపై మెరిశాడు ఆది సాయి కుమార్. వరుస హిట్లతో కెరీర్ ప్రారంభంలోనే అందరినీ ఆకట్టుకున్నాడు. విభిన్న ప్రయోగాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఈ మధ్యే శశి అనే ప్రేమ కథా చిత్రంతో పలకరించాడు. ఒకే ఒక లోకం అనే పాటతో అందరినీ ఆకట్టుకున్న ఆది.. సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. కానీ ఆది నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
అయితే తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఆది కొబ్బరికాయ కొట్టేశాడు. ఈ సినిమా ఇలా జనాల ముందుకు వచ్చిందో లేదో మరో చిత్రాన్ని రెడీ చేసేశాడు. తాజాగా ఆది మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్లు వైరల్ అవుతున్నాయి.

శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా.. A D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తానికి ఆది బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











