Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కోటికి కృతజ్ఞతను తీర్చుకొనే అవకాశం.. అన్ని సూపర్ హిట్సే.. చిరంజీవి ఎమోషనల్ స్పీచ్
టైగర్ హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా రూపొందుతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన నిర్మాణ సంస్థ తొలి చిత్రం ద్వారా పరిచయం అవుతున్న కోటి కుమారుడు రాజీవ్, మణిశర్మ కుమారుడు సాగర్‌కు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ స్పీచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..

నా ఎదుగుదలలో సింహభాగం కోటిదే
ఈ రోజు శుభదినం అనుకొంటా. నా సినిమా భోళాశంకర్ కూడా ఈ రోజే ప్రారంభమైంది. నిన్న రాత్రి 2 గంటల వరకు కోటి నివాసంలోనే నా సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఉత్సాహంగా మాట్లాడుతూ ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నేను రావడానికి మా కోటి ప్రధాన కారణం. కోటితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా కోసం అనేక హంగులతోటి ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంతా ఇంతా కాదు. నా విజయానికి, నా ఎదుగుదలలో సింహభాగం రాజ్ కోటి అందించిన మ్యూజిక్ అని చెప్పాలి. రాజ్ కోటి ఇద్దరూ కూడా నా సినిమా అంటే ప్రత్యేక శ్రద్ద చూపించే వాళ్లు.

70 పాటల్లో అన్నీ సూపర్ హిట్సే
రిక్షావోడు, హిట్లర్ వరకు నా సినిమాలకు సంగీతం అందించారు. దాదాపు 12 సినిమాలకుపైగా సినిమాలు నాతో చేశారు. వాళ్లు అందించిన 70 పాటల్లో 90 శాతం సూపర్ హిట్స్. అలా నా కెరీర్‌లో ఎంతో సహాయం చేసిన కోటి ఆహ్వానం మన్నించి రావడం జరిగింది. ముఖ్యంగా కోటి కుమారుడు రాజీవ్ సినిమా రంగంలోకి ప్రవేశిస్తూ జరిగిన వేడుకకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కోటికి కృతజ్ఞతను తీర్చుకొనే అవకాశంగా భావిస్తున్నాను అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

కోటి ఎందరికో స్పూర్తి అంటూ మెగాస్టార్
స్వర్గీయ సాలూరి రాజేశ్వరరావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కోటి ఎంతో ఘనతను సాధించారు. సాలూరి లెజెండ్. గొప్ప సంగీత దర్శకుడు వారసత్వాన్ని అందుకొని తండ్రికి తగిన తనయుడిగా రెండు దశాబ్దాలు సినీ ప్రపంచానికి సేవలు అందించారు అని చిరంజీవి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇప్పటికీ ఎందరికో స్పూర్తి. చాలా మంది తెరమరుగు అవుతుంటారు. కానీ కోటి బుల్లితెర మీద కూడా రాణిస్తూ సమకాలీన సంగీత దర్శకులు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఎంతో మంది ఔత్సాహికులకు మంచి మాటలు అందిస్తుండటం ఆయన మంచితనానికి నిదర్శనం అని చిరంజీవి చెప్పారు.

కోటి తెలివైన వాడు అంటూ
కోటి కుమారుడు రాజీవ్ నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ విషయంలో కోటి చాలా తెలివిగల వాడు. ఒక కుమారుడిని మ్యూజిక్ రంగంలో స్థిరపడేలా చేశారు. మరో కుమారుడిని నటుడిగా తీర్చిదిద్దుతున్నారు. రెండు శాఖల్లోను ఇద్దరు కుమారులను పంపుతూ చక్కటి ప్లాన్ చేసుకొన్నారు. సినిమా పరిశ్రమ వండర్‌ఫుల్ ఇండస్ట్రీ. కళామతల్లి ఎంతమందినైనా ఆదరిస్తుంది. కానీ కష్టాన్ని నమ్ముకోవాలి. నిజాయితీగా ఉండాలి. ఒక రోజు సక్సెస్ రాకపోయినా మరో రోజు వస్తుంది. కానీ నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. కష్టమనే తారకమంత్రం అనేదానిని నమ్ముకొన్నాను. కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. రాజీవ్‌కు బెస్టాఫ్ లక్ అని ఔత్సాహిక నటులకు చిరంజీవి సలహా ఇచ్చారు.
Recommended Video

మణిశర్మపై చిరంజీవి ప్రశంసల వర్షం
ఇక మణిశర్మ గురించి చెప్పాలంటే.. ఈ తరం యువ సంగీత దర్శకులతో పోటీ పడుతూనే ఉన్నాడు. ఆచార్య సినిమా కోసం లాహిరి లాహిరి పాట గానీ, నీలాంబరి పాటను ఇచ్చి ఆకట్టుకొన్నాడు. ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని మణిశర్మ కుమారుడు సాగర్‌కు భోళాశంకర్ చిత్రంలో అవకాశం కల్పించాం. యువతరం రావాలి. మేమంత వారికి ఆహ్వానిస్తున్నాం. అలాగే లాభాపేక్షతో కాకుండా సినిమాలపై అభిరుచితో టైగర్ హిల్స్ బ్యానర్‌తో సినీ నిర్మాణంలోకి వచ్చారు. వారికి స్వాగతం, కంగ్రాట్స్ అంటూ చిరంజీవి భావోద్వేగంగా ప్రసంగించారు.