పవర్ స్టార్ లుక్ సిద్ధం చేసిన గబ్బర్ సింగ్ డైరెక్టర్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్న హరీష్ శంకర్ ఆ తరువాత వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. కమర్షియల్ కథను మాస్ జనాలకి నచ్చేలా తెరకెక్కించడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు. స్టార్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేయగలడని చాలా సార్లు రుజువయ్యింది. ముఖ్యంగా డీజే సినిమాతో అల్లు అర్జున్ ను ఏ స్థాయిలో ప్రజెంట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబినేషన్ రెండవసారి మరింత సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే పవన్ ను ఈసారి రెండు విభిన్నమైమ షేడ్స్ లలో చూపించబోతున్నాడట. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ అలాగే సెకండ్ హాఫ్ లో పొలిటికల్ సీన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయని టాక్ వస్తోంది.

Director harish shankar and pawan kalyan movie powerful look ready

ఇక రీసెంట్ గా ఒక పవర్ఫుల్ లుక్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టయిలిష్ట్ అలాగే మేకప్ ఆర్టిస్ట్ తో ఒక లుక్కును డిజైన్ చేయించడట. అది పర్ఫెక్ట్ గా సెట్టవ్వడంతో హరీష్ శంకర్ తో పాటు చిత్ర యూనిట్ కూడా సూపర్ అనే కామెంట్ చేశారట. కచ్చితంగా పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేనంత కొత్తగా కనిపిస్తాడట. అటు మాస్ అడియన్స్, ఇటు క్లాస్ అడియెన్స్ ఇద్దరు మెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా రాసుకున్నాడట. సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఒక మంచి సందేశం ఉంటుందని సమాచారం. మరి సినిమా అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X