Don't Miss!
- News
ధన్ కీ బాత్ కాదంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్: బీఆర్ఎస్లోకి మాజీ సీఎం గమాంగ్, కీలక నేతలు
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అర్జున్ రెడ్డి రీమేక్.. ధృవ్‌కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!
స్టార్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్ ని ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ తన కుమారుడి తొలి చిత్రంగా ఇదే బావుంటుందని భావించాడు. వెంటనే బాల దర్శత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించారు. వర్మ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరిగిపోయింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ విక్రమ్ కు అవుట్ పుట్ నచ్చకపోవడంతో చిత్రాన్ని రద్దు చేశాడు.
దర్శకుడుని, హీరోయిన్ ని మార్చేసి మళ్ళి కొత్తగా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గిరిసాయ దర్శత్వంలో ఆదిత్య వర్మ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధృవ్ కి తండ్రిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటి బనిత సంధుని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2020లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. బాల తెరకెక్కించిన చిత్రం రద్దయినప్పుడు స్వయంగా నిర్మాతలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన చిత్రాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.