For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Gopichand: కష్టాల సముద్రాన్ని దాటిన నిజమైన హీరో.. ఒంటరిగా లక్ష్యాన్ని చేదించిన గోపిచంద్!

  |

  స్టార్ హీరోగా క్రేజ్ అందుకోవాలి అంటే అదృష్టంతో పాటు ఎంతగానో కష్టపడాలి. విలన్ నుంచి హీరోగా సక్సెస్ అవ్వడం ఒక గొప్ప గెలుపని చెప్పవచ్చు. ఆ రూట్లో సక్సెస్ అయిన హీరోల్లో గోపిచంద్ ఒకరు. తండ్రి దర్శకుడు టీ.కృష్ణ అని అందరికి తెలిసిందే. అయితే గోపిచంద్ వయసులోకి రాకముందే ఇంట్లో రెండు మరణాలు సంభవించడం అతని కుటుంబానికి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. నేడు పుట్టినరోజు సందర్భంగా గోపిచంద్ కెరీర్ పై ఒక లుక్కేస్తే..

  హాట్ నివిషా: ఓ వైపు ట్రెడిషనల్ మరోవైపు మోడ్రన్ లుక్..

  తొలి సినిమాతోనే డిజాస్టర్

  తొలి సినిమాతోనే డిజాస్టర్

  గోపిచంద్ అనగానే అందరికి అతని మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ముఖ్యంగా విలన్ గా చేసిన పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. నిజానికి అతను మొదట తొలి వలపు అనే సినిమాలో హీరోగా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక మళ్ళీ ఎలాగోలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు.

  ఆ సినిమాలతో విలన్ గా..

  ఆ సినిమాలతో విలన్ గా..

  తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం సినిమా విలన్ రోల్స్ గోపిచంద్ కు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అలాగే వర్షం సినిమాలో కూడా బెస్ట్ యాక్టింగ్ తో మరో స్థాయికి వెళ్ళాడు. ఇక విలన్ నుంచి యజ్ఞం , రణం, లక్ష్యం అంటూ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

  తండ్రి మరణం..

  తండ్రి మరణం..

  గోపిచంద్ ఇప్పుడు హీరోగా సంతోషంగా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఎన్నో విషాధాలు చూసి వచ్చాడు. గోపిచంద్ తండ్రి టీ.కృష్ణ ఒకప్పుడు ఎన్నో విప్లవాత్మక సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు. నేటి భారతం, వందేమాతరం, రేపటి పౌరులు వంటి సినిమాలను తెరకెక్కించారు. అయితే గోపిచంద్ 8 ఏళ్ళ వయసులో ఉండగానే తండ్రి మరణించడం ఫ్యామిలీని ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది.

  ఆ తరువాత అన్న మరణం

  ఆ తరువాత అన్న మరణం

  ఇక గోపీచంద్ ఉన్నత చదువుల కోసం రష్యాలో ఉండగా సోదరుడు ప్రేమ్ చంద్ కూడా మృతి చెందాడు. దర్శకుడు అవ్వాలని ప్రేమ్ చంద్ మొదటి సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఒక యాక్సిడెంట్ లో అతను మృతి చెందాడు. అప్పుడు రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్న గోపిచంద్ వీసా రాకపోవడంతో కనీసం కడసారి కూడా చూడలేకపోయాడు.

  ఫ్యామిలీ కోసం..

  ఫ్యామిలీ కోసం..

  తండ్రి, అన్నయ్య మరణం తరువాత ఫ్యామిలీ బాధ్యత మొత్తం గోపిచంద్ పైనే పడింది. అమ్మా, చెల్లిని చూసుకోవాలని మొదట ఒక న్యూస్ రీడర్ గా కూడా చేశాడు. అనంతరం సినిమాల్లోకి రావాలని హీరోగా చేసి మొదట్లోనే ఫెయిల్ అయ్యాడు. అనంతరం విలన్ గా చేసి హీరోగా యూ టర్న్ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో గోపిచంద్ కు ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అని అందరికి తెలిసిందే.

  ఇద్దరు కొడుకులు..

  ఇద్దరు కొడుకులు..

  ఇక కెరీర్ లో ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా తన పని చేసుకుంటూ వెళ్ళాడు. గోపిచంద్ చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఇక శ్రీకాంత్ కు దగ్గరి బంధువు అయిన అమ్మాయి రేష్మను గోపిచంద్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. మళ్ళీ నాన్న, అన్నయ్య వాళ్ళ రూపంలో తిరిగి వచ్చారని గోపిచంద్ ఆనందపడుతుంటాడు.

  English summary
  To receive craze as a star hero means to work hard along with luck. Succeeding from villain to hero is a great win. Gopichand was one of the heroes who succeeded on that route. Everyone knows that the father is the director T. Krishna. However, the two deaths at home before Gopichand came of age were an irreparable blow to his family
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X