4 ఏళ్ల లవ్ జర్నీ.. ప్రేమకు కొత్త నిర్వచనం చెబుతున్న హృతిక్–సబా జంట
Hrithik Roshan-Saba Azad: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, ప్రేమ కథలు ఎంత ఆసక్తిగా చర్చించబడతాయో, వారి విడాకులు, బ్రేకప్‌లు కూడా అంతే హాట్ టాపిక్ అవుతుంటాయి. అభిమానుల దృష్టిలో ఎప్పటికప్పుడు ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది "ఎవరి దాంపత్య జీవితానికి గండిపడుతుందా? ఎవరెవరూ విడిపోతారా? ఎవరూ ఎవరితో ఉన్నారా? అనే విషయాలు ఇట్టే వైరల్ అవుతాయి. సోషల్ మీడియా పెరిగిన తరుణంలో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. హీరో, హీరోయిన్ లేదా ఇతర సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామిని ఫాలో అయినా.. ఫోటోలకు లైక్ కొట్టిన వెంటనే అది గాసిప్‌గా మారుతుంది. తాజా బాలీవుడ్ స్టార్ హీరో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు. హీరో హృతిక్ రోషన్.. హృతిక్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటన, అసాధారణమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలు, కొత్తదనంతో కూడిన కథాంశాలు ఎంచుకుని ప్రేక్షకులను అలరించడం హృతిక్ ప్రత్యేకత. అందుకే ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే కేవలం బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, సౌత్ ఆడియన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హృతిక్ రోషన్‌కి అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది.

అలాంటి హృతిక్‌కి సంబంధించిన ప్రతి చిన్న విషయమే సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. అది ఆయన సినిమా అప్డేట్ కావచ్చు, ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన చిన్న జ్ఞాపకం కావచ్చు లేదా జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు - అభిమానులు క్షణాల్లో షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుస్తారు. అలా తాజాగా హృతిక్ రోషన్ తన ప్రియురాలు సబా అజాద్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
హృతిక్, సబా ఇద్దరూ ఒకే విధమైన ఫొటోలు షేర్ చేస్తూ.. "నీతో కలిసి ఈ జీవన ప్రయాణంలో నడవడం నాకు ఎంతో ఇష్టం... హ్యాపీ 4వ వార్షికోత్సవం ప్రియతమా." అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలు వారి డేట్ నైట్స్, వేకేషన్లలో తీసినవి. ఒక ఫొటోలో సబా, హృతిక్ భుజంపై తల పెట్టుకుని నిద్రిస్తున్నది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు 'ట్రూ కపుల్ గోల్స్', 'గాడ్ బ్లెస్ యూ బోత్'అంటూ విషెష్ చేస్తున్నారు.
హ్యాపీ అవుటింగ్స్
కొద్ది నెలల క్రితం హృతిక్-సబా జంట అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో వారి స్నేహితురాలు సోఫీ చౌదరి కూడా వారితో లంచ్ డేట్‌లో పాల్గొన్నారు. సోఫీ తన సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలలో హృతిక్-సబా ఆనందంగా కలిసి గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
హృతిక్-సబా రిలేషన్‌షిప్ ఇలా..
హృతిక్, సబా ప్రేమకథ 2022లో మొదలైంది. మొదటగా హృతిక్, ట్విట్టర్‌లో సబా ఒక రాపర్‌తో చేసిన వీడియోని లైక్ చేసి షేర్ చేశాడు. దానికి సబా స్పందించి థ్యాంక్స్ చెప్పింది. ఇదే వారి సంభాషణకు, తర్వాత ప్రేమకథకు ఆరంభమైంది. ఈ జంట పలు బర్త్‌డే పార్టీస్, వెడ్డింగ్స్, ఫ్యామిలీ బ్రంచెస్, వెకేషన్స్లో కలసి కనిపించారు. 2022లో కరణ్ జోహార్ 50వ బర్త్‌డే బాష్ లో ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ట్వినింగ్ చేస్తూ పబ్లిక్‌గా తమ రిలేషన్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. "ప్రేమ అంటే ఇదే" సెలబ్రెటిలకు విషెష్ చెబుతున్నారు. సినీ వర్గాల్లోనూ హృతిక్-సబా బంధం గురించి చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











