Jr NTR 20 years: మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఇప్పుడు ఊహాలకందని రేంజ్‌లో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ ట్యాగ్ అందుకున్న అతికొద్ది మంది స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్.. సింగింగ్, ఏదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకొని తన బెస్ట్ ఇవ్వగలడని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకోగలిగే తారక్ నేటితో హీరోగా 20ఏళ్ళను పూర్తి చేసుకున్నాడు.

నందమూరి హీరోల్లో అత్యదిక మార్కెట్
నందమూరి వంశంలో ముడవతరం వారసుడిగా తన రేంజ్ ను అంతకంతకు పెంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తాత గారి బాటలోనే నడుస్తూ నటనతో మంచి గుర్తింపు అందుకుంటూ వచ్చాడు. నందమూరి హీరోల్లో అత్యదిక మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా కూడా క్రేజ్ అందుకున్నాడు. నటనతోనే కాకుండా మంచి తనంలో కూడా తాతగారిని గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు.
నేటికి 20 ఏళ్లయ్యింది
ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మొదటి సినిమా 'నిన్ను చూడాలని' విడుదలైన నేటికి 20 ఏళ్లయ్యింది. ఈ సినిమా 2001 మే 25న విడుదలయ్యింది. అసలైతే 1996లోనే బాలరామాయణం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన తారక్ ఆ తరువాత రామోజీరావు ప్రొడక్షన్ లో హీరోగా సినిమా చేయడానికి ఒప్పుకున్నడు. నువ్వు వాస్తవని దర్శకుడు ప్రతాప్ దర్శకత్వంలోనే నిన్ను చూడాలని సినిమా తెరకెక్కింది.

రాజమౌళి దర్శకత్వంలో..
అసలైతే మొదట జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చేయాల్సింది. ఆ సినిమా ప్రొడక్షన్ వలన ఆలస్యం కావడంతో నన్ను చూడాలని సెట్స్ పైకి వచ్చి ముందుగానే రిలీజ్ అయ్యింది. ఆ సినిమా అంతగా హిట్టవ్వకపోయినా కూడా తారక్ కు మంచి క్రేజ్ వచ్చింది.
మొదటి సినిమా రెమ్యునరేషన్
ఇక నిన్ను చూడాలని సినిమాకు హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ 4లక్షల రూపాయలు. ఆ డబ్బు చేతికి రాగానే నెల రోజుల పాటు ఎక్కడ దాచాలో తెలియక రకరకాల చోట్ల దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానని, అయితే చివరికి కన్ఫ్యూజన్ తట్టుకోలేక మా అమ్మకి ఇచ్చేసినట్లు ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.
Recommended Video

ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్...
అలా 4లక్షలతో మొదలైన జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా 30కోట్లను దాటింది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 30కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ సినిమా హిట్టయితే ఈజీగా 40కోట్లకు పెరగవచ్చు. నెక్స్ట్ కొరటాల శివ సినిమాను అలాగే ప్రశాంత్ నీల్ సినిమాను లైన్ పెట్టిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











