Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మహేష్ జీవితంలో అతి ముఖ్యమైన రోజు.. స్పెషల్ పర్సన్ కోసం బెస్ట్ విషెస్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా సింపుల్ గానే ఉంటాడని అందరికి తెలిసిందే. సౌత్ ఇండియన్ టాప్ సెలబ్రెటీస్ లో ఒకరైన మహేష్ లో సామాజిక బాధ్యత కూడా చాలానే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శాస్త్ర చిక్కిత్సలను చేయించాడు.
అయితే మహేష్ జీవితంలో అతి ముఖ్యమైన రోజు ఏదైనా ఉందా అంటే అది తన తల్లి పుట్టినరోజే అని చెబుతాడు. 'నేడు అమ్మ ఇందిరా దేవి పుట్టినరోజు అంటే నాకు చాలా స్పెషల్ అంటూ..ఆమె నా లైఫ్ లో స్పెషల్ పర్సన్.. హ్యాపీ బర్త్ డే అమ్మా' అని మహేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో అభిమానులు కూడా మహేష్ తల్లికి బెస్ట్ విషెస్ ని అందిస్తూ రీట్వీట్ చేస్తున్నారు.
April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020

ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కూడా రాబోతోంది. ప్రతి ఏడాది మే 31న మహేష్ తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం కామన్ గా మారింది. ఈ సారి కూడా నెక్స్ట్ సినిమాకు సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నాడు. మహేష్ తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రాజమౌళి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సూపర్ స్టార్ సిద్ధమవుతున్నారు.