Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pawan Kalyan తో మల్టీస్టారర్ సినిమాపై మెగాస్టార్ కామెంట్.. అప్పుడే అంటూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే చూడాలని ఎంతోమంది సినీ లవర్స్ కోరుకుంటున్నారు. గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి కానీ అవి ఏది నిజం కాదు అని మరి కొన్నాళ్లకు క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలపై స్పందిస్తూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ తో కూడా మల్టీస్టారర్ సినిమా చేసే విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే..

వీరయ్య టీమ్ ప్రెస్ మీట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ సోమవారం జరగగా అందులో మెగాస్టార్ మల్టీస్టారర్ సినిమాలపై కూడా ప్రత్యేకంగా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

గతంలోనే మల్టీస్టారర్ ఆలోచనలు
అసలైతే గతంలో చాలాసార్లు మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలు చేయాలని అనుకున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తో కూడా కొన్ని సినిమాలు చేయాలని ప్రస్తావనకు వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టులు సరైన స్క్రిప్ట్ తో ఫిక్స్ కాకపోవడంతో మెగాస్టార్ అటువైపు ఒక పెద్దగా ఆలోచన చేయలేదు. కానీ మిగతా హీరోలు కొందరు మెగాస్టార్ సినిమాలో అతిధి పాత్రలు చేయడానికి బాగానే ఒప్పుకున్నారు.

మళ్ళీ ఇన్నాళ్లకు రవితేజతో..
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలకం కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో అన్నయ్య సినిమాలో చిరంజీవి సోదరుడిగా కనిపించిన రవితేజ మళ్ళీ ఇన్నాళ్లకు మరొక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వీరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి అని తెలుస్తోంది.

ఎవరితో అయినా సిద్ధమే
అయితే రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మిగతా స్టార్ హీరోలతో కూడా మల్టీస్టరర్ సినిమాలు చేస్తారా లేదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పకుండా మంచి కథతో అలాంటి మల్టీస్టారర్ ప్రాజెక్టులు వద్దకు వస్తే చేస్తాను అని అన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ ఎవరితో చేయడానికి అయినా సరే సిద్ధమే అంటూ చిరు తెలియజేశారు.
|
పవన్ తో సినిమా..
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తారా అని అడిగినప్పుడు తప్పకుండా చేస్తాను అని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు అని అలాగే నేను కూడా మరికొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం గురించి ఆలోచిస్తాను అని అన్నారు. మెగాస్టార్ ఆలోచిస్తే మాత్రం తప్పకుండా పవన్ తో సినిమా చేస్తారు అని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు తెర పైకి వస్తుందో చూడాలి.