Don't Miss!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- News
వచ్చే ఎన్నికల్లో పోటీచేయడంలేదు.. YCP MLA కీలక ప్రకటన!
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya: జంబలకడి జారు మిఠాయి అంటూ మెగాస్టార్ రచ్చ.. ఆ సీన్ మీమ్స్ కంటే హైలెట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదటి రోజే మెగా ఫాన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ ను అయితే బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చేసిన కొన్ని ఫన్నీ సీన్స్ అయితే చాలా హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఎంతగానో వైరల్ అయిన జంబలకిడి జారు మిఠాయి అనే పాట కూడా అందులో హైలెట్ గా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెగా మాస్ కాంబో..
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను కమర్షియల్ దర్శకుడు బాబి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా నటించగా మాస్ మహారాజ రవితేజ మరొక కీలకమైన పాత్రలో కనిపించాడు. ఇక వీరికి సంబంధించిన సీన్స్ చాలావరకు సినిమాలో హైలైట్ అయ్యాయి. కేవలం కామెడీ ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా ఇద్దరు మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

మెగాస్టార్ కామెడీ టైమింగ్
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత తనలోని సరికొత్త కామెడీ టైమింగ్ ను కూడా ప్రజెంట్ చేశాడు. మళ్ళీ పాత రోజుల్లోని మెగాస్టార్ ని చూసినట్లుగా ఉంది అని చాలామంది చూసిన ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఘరానా మొగుడు, ముఠామేస్త్రి అలాగే అందరివాడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది అని ప్రేక్షకులు స్పందిస్తున్నారు.

మీమ్స్ కూడా వదల్లేదు
ఇక ఈ సినిమాలో చాలావరకు కొన్ని సన్నివేశాలకు ఫ్యాన్స్ ను మరింత ఎక్కువ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన ఇంట్రడక్షన్ సీన్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా అందులో కొన్ని మీమ్స్ గురించి కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించడం సినిమాలో హైలెట్ గా తెలిసినట్లుగా చెబుతున్నారు.

జంబలకిడి జారు మిఠాయి
ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన జంబలకిడి జారు మిఠాయి అని వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ పాటను కూడా మెగాస్టార్ చిరంజీవి ఇమిటెడ్ చేయడం మరింత హైలెట్ గా నిలిచింది. మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పల్లెటూరి సింగర్ ఆ పాటలు పాడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆకట్టుకున్న కామెడీ
ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే వాల్తేరు వీరయ్య సినిమాలో జంబలకిడి జారు మిఠాయి అనే పాటను చాలా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రజెంట్ చేయడం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటారని మరోసారి నిరూపించారు. వాల్తేరు వీరయ్య సినిమా అయితే మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పూర్తిస్థాయిలో సినిమా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.