Samantha breakup with Chaitu తండ్రిగా అలాంటి బాధ.. కొడుకు విడాకులపై స్పందించిన నాగార్జున

టాలీవుడ్‌లో గత సంవత్సరం హాట్ టాపిక్‌‌గా, ట్రెండింగ్‌గా, వైరల్‌గా నిలిచిన వార్తల్లో సమంత, నాగచైతన్య విడాకుల వార్త ప్రముఖంగా మారింది. సమంత, చైతూ విడిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఇద్దరు అనూహ్య పరిస్థితుల్లో విడిపోవడం అభిమానులకు దిగ్బ్రాంతికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు కొడుకు, కోడలు విడిపోవడంపై స్పందించని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా ద్వారా సమంత, చైతూ

సోషల్ మీడియా ద్వారా సమంత, చైతూ

టాలీవుడ్‌లో అనేక రూమర్లు, గాసిప్స్, ఊహాగానాల మధ్య సమంత అక్కినేని, నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాగచైతన్య తన విడాకుల ప్రకటనను తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మా మధ్య మంచి బంధం ఉంది. ఇక ముందు ఆ బంధాన్ని అలాగే కొనసాగిస్తాం. మా స్నేహం అలానే కొనసాగుతుంది అని సమంత, నాగచైతన్య సంయుక్తంగా ప్రకటన చేశారు.

తీవ్రంగా స్పందించిన సమంత

తీవ్రంగా స్పందించిన సమంత

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కూడా పెద్దగా స్పందించలేదు. కానీ తన ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించే విధంగా కథనాలు రావడంతో కోర్టును ఆశ్రయించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. అయితే నాగచైతన్యపై ఎలాంటి కామెంట్స్ కూడా చేయకపోవడం గమనార్హం.

సమంత హ్యాపీ.. నేను హ్యాపీ అంటూ

సమంత హ్యాపీ.. నేను హ్యాపీ అంటూ

అయితే బంగార్రాజు సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు చైతూ స్పందిస్తూ.. మా ఇద్దరి మంచి కోసమే విడాకులు తీసుకొన్నాం. సమంత హ్యాపీగా ఉంది. నేను కూడా హ్యాపీగా ఉంది అంటూ నాగచైతన్య సమాధానం చెప్పారు. విడాకుల తర్వాత సమంత గురించి నాగచైతన్య మాట్లాడటం ఇదే మొదటిసారి కావడంతో జాతీయస్థాయి మీడియా కూడా ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

సమంతతోనే బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్

సమంతతోనే బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్

అలాగే బంగార్రాజు ప్రమోషన్స్ గురించి బాలీవుడ్ మీడియాతో నాగచైతన్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ సమంతతోనే. నా మాజీ భార్యతో కలిసి నటించిన సినిమాల్లోనే నేను బెస్ట్ రొమాంటిక్ మూమెంట్స్ ఉన్నాయి అని నాగచైతన్య ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాలీవుడ్‌‌లో తనకు ఆలియాభట్, దీపిక పదుకోన్‌తో కలిసి నటించాలని ఉంది. వారిద్దరి ఫెర్ఫార్మెన్స్ అంటే ఇష్టం. అవకాశం వస్తే వారిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని నాగచైతన్య అన్నారు.

తొలిసారి స్పందించిన నాగార్జున

తొలిసారి స్పందించిన నాగార్జున

ఇక సమంత, నాగచైతన్య విడాకుల గురించి ఫస్ట్ పోస్ట్ అనే వెబ్ పోర్టల్‌తో నాగార్జున మాట్లాడుతూ.. చాలా ఇబ్బందికరమైన క్షణాలను అనుభవించాను. తన జీవితంలో చోటుచేసుకొన్న విషాదఘట్టాన్ని చైతూ చక్కగా డీల్ చేశాడు. చైతూ తీసుకొన్న నిర్ణయం, ఆ సమయంలో అతను వ్యవహరించిన తీరు చూసి గర్వపడ్డాను. ఈ విషయంలో ఏ ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. తన జీవితం ఏమౌతుందో అనే బాధ కంటే నేను పడే బాధ గురించే ఎక్కువగా ఆందోళన చెందాడు అని నాగార్జున అన్నారు.

ప్రతీ తండ్రి పడే బాధనే అంటూ నాగ్

ప్రతీ తండ్రి పడే బాధనే అంటూ నాగ్


ఇక సమంతతో చైతూ బ్రేకప్ అంశం విషయంలో ప్రతీ తండ్రి పడే విధంగానే బాధపడ్డాను. తాను బాధపడుతున్నాననే విషయం గ్రహించి.. మీరు బాగానే ఉన్నారా? అని అడిగాడు. అలాంటి పరిస్థితుల్లో తన గురించి కాకుండా తండ్రి గురించి ఆలోచించిన విధానం చూసి నేను చలించిపోయాను అని నాగార్జున తెలిపారు.

నాగచైతన్య సినిమా కెరీర్ గురించి

నాగచైతన్య సినిమా కెరీర్ గురించి

నాగచైతన్య సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల లవ్ స్టోరి సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు. తాజాగా బంగార్రాజు మూవీతో మరో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకొన్నారు. బాలీవుడ్‌లోకి ప్రవేశించి అమీర్ ఖాన్, కరీనాకపూర్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించాడు. ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X