శ్యామ్ సింగ రాయ్ కోసం నాని బిగ్గెస్ట్ ప్లాన్.. కెరీర్ లోనే మొదటిసారి అలా..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని రేంజ్ కూడా సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ కథలను చేస్తూనే ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా టచ్ చేస్తున్నాడు. అంతే కాకుండా కెరీర్ లో మొదటి సారి బిగ్ బడ్జెట్ సినిమాలను చేయడానికి శ్యామ్ సింగరాయ్ తో శ్రీకారం చుట్టాడు. ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోతో సమానంగా సాయి పల్లవి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయంలో నాని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కెరీర్ లో మొదటిసారి లాంగ్ షెడ్యూల్ ఫైనల్ చేసినట్లు సమాచారం.

సినిమాను స్టార్ట్ చేస్తే ఏ మాత్రం ఆపకుండా షూటింగ్ మొత్తం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాపై మరోసారి థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పడకూడదని ముందు జాగ్రత్తగా తొందరగా ఫినిష్ చేస్తే బావుంటుందని దర్శకుడికి నిర్మాతలకు వివరణ ఇచ్చారట. అయితే వాళ్ళు ఒప్పుకున్నప్పటికి సాయి పల్లవి డేట్స్ దొరకడం అనుమానమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె కూడా పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఈ కన్ఫ్యూజన్ పై ఎలాంటు సమాధానం వెతుకుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











