twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishnam Raju సంస్మరణ సభ.. ప్రభాస్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా.. వంటల కోసమే కోట్ల రూపాయలు!

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ మర్యాద ఇవ్వడంలో నిజంగా రాజులను తలపిస్తాడు అని ఇంతకాలం చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ గురువారం కృష్ణంరాజు కోసం ప్రత్యేకంగా నిర్వహించిన సంస్మరణ సభ కోసం ఆయన భోజనాలతో ఇచ్చిన మర్యాదతో మరోసారి చాలా క్లారిటీగా అర్థమయిపోయింది. అసలు గతంలో ఏ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో అభిమానుల కోసం భోజనాలు పెట్టించలేదు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ చాలా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    బాధ్యత తీసుకున్న ప్రభాస్

    బాధ్యత తీసుకున్న ప్రభాస్

    కృష్ణంరాజు ఇటీవల స్వర్గస్తులు కావడంతో జరగాల్సిన కార్యక్రమాలను ప్రభాస్ దగ్గరుండి చూసుకున్నాడు. ఇక ముఖ్యంగా సంస్మరణ సభ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని తన చేతుల మీదుగా నిర్వహించాలని అనుకున్నాడు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకు అయినప్పటికీ కూడా ఇంటికి పెద్ద కుమారుడుగా ప్రభాస్ తీసుకున్న బాధ్యత గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

    12 ఏళ్ళ తరువాత

    12 ఏళ్ళ తరువాత

    ఒక విధంగా ప్రభాస్ తన సొంత ఊరు మొగల్తూరుకు చాలా కాలం తర్వాత వచ్చాడు. చివరిగా అతని తండ్రి మరణించినప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రభాస్ మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీతో కలిసి మొగల్తూరులో అడుగుపెట్టాడు. దీంతో అభిమానులందరూ కూడా అతన్ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక వచ్చిన వారందరికీ కూడా అతిధి మర్యాదలు చేసిన ప్రభాస్ ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయించడం విశేషం.

    1 లక్ష 40 వేల మందికి

    1 లక్ష 40 వేల మందికి

    ఇక సంస్మరణ సభ కోసం దాదాపు లక్ష మందికి పైగానే అభిమానులు వస్తారు అని ప్రభాస్ టీం ముందుగానే పసిగట్టింది. దీంతో ప్రభాస్ కూడా ఎంతకైనా మంచిది అని ఒక లక్ష 40 వేల మందికి సరిపోయెంత భోజనాలు సిద్ధం చేసి ఉంచాలి అని చెప్పాడట. అంతేకాకుండా ఖర్చుకు ఏమాత్రం వినపడకుండా నాన్ వెజ్ అలాగే వెజ్ కు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించినట్లుగా తెలుస్తోంది.

    టన్నులలో నాన్ వెజ్

    టన్నులలో నాన్ వెజ్

    ప్రభాస్ ప్రిపేర్ చేయించిన వంటకాలు సంబంధించి సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చాయి. 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై.. ఇలా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు టన్నుల లెక్కలో రెడీ చేయించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా టన్నులలో బిర్యానీలు చేస్తారు అని వినడం ఇదే మొదటిసారి అని అభిమానులు కూడా మాట్లాడుకున్నారు.

    ఎంత ఖర్చు చేశారంటే?

    ఎంత ఖర్చు చేశారంటే?

    దాదాపు వెజ్ నాన్ వెజ్ లతో కలిపి 50 కి పైగా వంటకాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ప్రభాస్ భారీ స్థాయిలో ఖర్చు చేశాడు. దాదాపు ఈ వంటలన్నీటికి కూడా నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఎక్కడ కూడా కల్తీ జరగకుండా నాణ్యమైన వంట నూనె వాడినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రభాస్ టీం వంటలు రెడీ అవుతున్న సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ మరి జాగ్రత్తలు తీసుకున్నారు.

    English summary
    Prabhas arranged special food in Krishnam raju condolence meet and total cost details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X