Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Rajinikanthకి సర్జరీ.. కీలక ప్రకటన విడుదల చేసిన వైద్యులు.. అసలు ఏమైంది అంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ అనూహ్యంగా 28వ తారీఖున చెన్నై హాస్పిటల్లో చేరడం అభిమానులలో టెన్షన్ రేపింది. గత ఏడాది ఆన్నాత్తే షూటింగ్ సమయంలో ఆయన ఆరోగ్యం తీవ్ర స్థాయిలో విషమించడంతో ఈసారి ఏమవుతుందో అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా రజినీకాంత్ హెల్త్ అప్ డేట్స్ కు సంబంధించి ఆయన జాయిన్ అయిన కావేరి హాస్పిటల్ ఒక బులిటెన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

అభిమానులలో టెన్షన్
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన 67వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్ హాస్పిటల్ పాలయ్యారని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన అభిమానుల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. అయితే ఇది సాధారణ చెకప్ లో భాగంగానే జరుగుతోందని రజినీకాంత్ సన్నిహితుల నుంచి ముందు సమాచారం వచ్చింది. ప్రతి నెల లాగానే ఈ నెల కూడా చెకప్ కి వెళ్లారు అంతే తప్ప భయపడాల్సింది ఏమీ లేదని ముందు పేర్కొన్నారు.

సర్జరీ చేశామంటూ ప్రకటన
ఆ తర్వాత రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇది సాధారణ చెక్ అప్ లో భాగంగానే జరుగుతున్న చెకప్ అని అంతే తప్ప భయపడాల్సింది ఏమీ లేదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే ముందు నుంచి భయపడుతున్న అభిమానులకు రజినీకాంత్ సన్నిహితులు అలాగే ఆయన భార్య ప్రకటన కాస్త ఊరటనిచ్చాయి. ఇక తమ అభిమాన హీరోకి ఏమీ కాలేదు అనే ధైర్యంతో వాళ్లు అందరూ ఉన్నా కానీ అనూహ్యంగా రజినీకాంత్ కి సర్జరీ చేసినట్లుగా వైద్యులు ప్రకటించడంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఆందోళన పడుతున్న8 పరిస్థితి కనిపిస్తోంది.

అసలు ఏమైంది అంటే?
29వ తేదీ అక్టోబర్ నెల శుక్రవారం నాడు రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రకటన వెలువడింది.. 28వ తేదీన రజినీకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల లో భాగంగా తమ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు ఒక శస్త్రచికిత్స చేయాల్సి ఉంది అనే విషయాన్ని వెల్లడించారు అని పేర్కొన్నారు.
దీంతో వైద్యుల సూచన మేరకు రజనీకాంత్ కు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే శస్త్రచికిత్స చేశారని, అది ఈరోజు విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానని!
రజినీకాంత్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన కుమార్తె ఒక వాయిస్ ఆప్ సిద్ధం చేయగా దాని నుంచి రజనీకాంత్ ఒక వాయిస్ నోట్ కూడా విడుదల చేశారు. వాయిస్ నోట్ లో రాబోయే దీపావళి రోజున విడుదల కానున్న తన అన్నాత్తే సినిమాను మనవడు వేద్ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాననీ చెప్పుకొచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న పెద్దన్న(అన్నాత్తే) సినిమా షూటింగ్ పూర్తి కాగా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Recommended Video

గత ఏడాది కూడా ఇలానే
ఇక గతేడాది షూటింగ్ సమయంలో కూడా రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారు. వారం రోజుల పాటు చికిత్స తీసుకుని ఆ తర్వాత చెన్నై వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అంటే? అది గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స. రక్త ప్రసరణను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన శస్త్రచికిత్స అని, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల జీవిత నాణ్యత మరియు జీవితకాలాన్ని మెరుగుపరచడంలో ఇటీవలి సంవత్సరాలలో ఈ పునర్వ్యవస్థీకరణ దోహదపడిందని అందుకే రజినీ విషయంలో కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.